ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎలా మట్టి కొట్టుకుపోయిందో తెలిసిందే. ఈసారి భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలివిగా ఆడిన బ్లేమ్ గేమ్ దెబ్బకు భాజపాకు గట్టిగానే డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకసారి ప్రత్యేక హోదా వద్దని.. ఇంకోసారి హోదా కావాలని డ్రామా ఆడిన చంద్రబాబు.. కేంద్రం ఏపీకి ఏ సాయం చేయట్లేదనే అభిప్రాయాన్ని జనాల్లో బాగానే వెళ్లేలా చేయగలిగారు. తన వైఫల్యాన్ని భాజపా మీద నెట్టేసే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారయన. దీంతో భాజపాకు కష్ట కాలం తప్పేట్లు లేదు. దీంతో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి ఓ కీలక నేత అధికార తెదేపాలోకి జంప్ చేస్తున్నట్లు సమాచారం.
విశాఖ జిల్లాకు చెందిన భాజపా నేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు పి.విష్ణుకుమార్ రాజు అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీలో ఉంటే గెలుపు అసాధ్యమని గుర్తించి ఆయన టీడీపీలోకి జంప్ చేయనున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారని ఇటీవలే ఆయన ఒక సర్వే చేయించారట. దాని ఆధారంగా భాజపా నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని తేలిందట. దీంతో ఆయన తెదేపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. కానీ, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఇటీవలే రాజు మీడియాతో చెప్పారు. రాజు పార్టీ వీడొచ్చని కొన్ని రోజుల ముందు నుంచే సంకేతాలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా బీజేపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ముందు నుంచి చంద్రబాబుకు అనుకూలుడిగా ఉన్న విష్ణుకుమార్ రాజు.. తెదేపాకు-భాజపాకు ఘర్షణ వైఖరి నడుస్తున్న సమయంలోనూ ఆయన్ని విమర్శించడం లేదు. తెదేపా చేపట్టిన పట్టిసీమ.. పోలవరం ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబునే మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెదేపాలో రాజు చేరిక లాంఛనమే అని భావించాలి.
Full View