వరుణుడు కూడా మోడీ వైపేనట.. ఆసక్తికరంగా బీజేపీ నేతల మాట
తాము టార్గెట్ చేసిన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఎంత కష్టానికైనా సిద్దమనేట్లుగా వ్యవహరించే తీరు భారతీయ జనతాపార్టీలో కనిపిస్తుంది. మరే రాజకీయ పార్టీలో కనిపించని ఇలాంటి తీరు ఆ పార్టీ సొంతం. అదే.. శతాధిక వయసున్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి.. దేశంలో మరో ప్రత్యామ్నాయం అన్నది లేకుండా చేయటం సాధ్యమైంది.
తెలంగాణను టార్గెట్ చేసుకొన్న మోడీ అండ్ కో.. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించటం.. దాని కోసం దేశ వ్యాప్తంగా ఉన్న 18 మంది ముఖ్యమంత్రుల్ని హైదరాబాద్ కు తీసుకురావటమే కాదు.. యావత్ బీజేపీనే తెలంగాణలో తిష్ట వేసిన పరిస్థితి.
హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యత ఎంతన్న విషయం.. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరును చూస్తేనే చెప్పేయొచ్చు. ఇంత ధూంధాంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం కమలనాథుల టెన్షన్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. మేఘాలు కమ్మిన ఆకాశం.. వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటన్న టెన్షన్ పుట్టింది. అప్పటికి చిరు జల్లులు అప్పుడప్పుడు పలుకరించి టెన్షన్ పుట్టించాయి.
వర్షం పడితే కూడా ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినప్పటికీ.. వాన రాకుండాబహిరంగ సభ పూర్తి కావాలని తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున దేవుడ్ని ప్రార్థించినట్లుగా చెప్పాలి. మొత్తానికి వారి విన్నపాన్ని వరుణుడు బాగానే విన్నట్టుంది. ఆదివారం కురవని వాన.. సోమవారం మాత్రం వడ్డీతో సహా కురిసేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మొదలై రాత్రి వరకు సాగిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇదంతా చూసిన బీజేపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో వరుణుడు కూడా బీజేపీనే అంటూ వ్యాఖ్యానించారు. తాము కోరుకున్నట్లుగా ఆదివారం వాన కురకుండా వరుణుడు తమ పక్షాన నిలిచారని.. ఒకవేళ ఆదివారం వర్షం కురిసి ఉంటే.. అంత భారీగా సభ సక్సెస్ అయ్యేది కాదన్న మాట వారి నోట వినిపిస్తోంది.
భారీ బహిరంగ సభ విషయంలో తెలంగాణ అధికారపక్షం తమకు ఎన్ని చికాకులు కల్పించినా.. వరుణుడు మాత్రం తమ వైపు నిలిచి తమకు సాయం చేశారని వారు పేర్కొంటున్నారు. నిజమే.. ఆదివారం వర్షం కాని పడి ఉంటే.. అంత భారీగా జనం సభకు హాజరయ్యే అవకాశం ఉండదన్న మాట వినిపిస్తోంది.