రాహుల్ గాంధీ బీజేపీకి అలా దొరికేశారు!

Update: 2019-04-02 06:32 GMT
-కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడం విషయంలో రాహుల్ గాంధీ రైటేనా? అనే అంశంపై చర్చ సాగుతూ ఉంది.

-ఒకవైపు రాహుల్ కేరళకు వచ్చి పోటీ చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో సఖ్యతగా ఉన్న ఎర్ర పార్టీలో కేరళలో మాత్రం కాంగ్రెస్ తో తలపడుతూ ఉన్నాయి. ఇలాంటి నేఫథ్యంలో రాహుల్ వచ్చి కేరళలో పోటీ చేయడం ఆ పార్టీలకు నచ్చడం లేదు.

-రాహుల్ ను ఓడించడానికి కేరళలో కమ్యూనిస్టులు - బీజేపీ చేతులు కలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కేరళలో బీజేపీ అడుగులు పెడుతోంది.

-ఇక రాహుల్ వయానాడ్ లో పోటీ చేయడం గురించి బీజేపీ కొత్త లాజిక్కులు తీస్తోంది. హిందువుల జనాభా అత్యల్పంగా  ఉండే నియోజకవర్గం వయనాడ్ అని.. అలాంటి చోట రాహుల్ పోటీ చేస్తున్నారని బీజేపీ దెప్పి పొడుతోంది.

-వయనాడ్ లో హిందువుల జనాభా అత్యల్పం అని - కేవలం అక్కడ ఎనిమిది శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారని బీజేపీ అంటోంది.

-అక్కడ క్రిస్టియన్లు - ముస్లింల జనాభా భారీగా ఉంది. హిందువులు అక్కడ మైనారిటీలు. ఏరికోరి ఇలా హిందూ జనాభా అత్యల్పంగా ఉన్న నియోజకవర్గంలో రాహుల్ పోటీ చేయడం ఏమటని.. మైనారిటీ రాజకీయాలు చేస్తున్నారని  అంటూ బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు!

-మొత్తానికి రాహుల్ గాంధీ వయనాడ్ లో పోటీ చేయడం అనే ఆలోచనతో మరోసారి బీజేపీకి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ మైనారిటీ మెహర్బానీ రాజకీయాలకు ఇదీ ఒక నిదర్శనమని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది!
Tags:    

Similar News