పేరుకు మిత్రపక్షాలే కానీ..నిత్య కలహాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టీడీపీ-బీజేపీ బంధంలో కీలక మలుపు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి బీజేపీని బద్ నాం చేయాలని, ఇందుకు ప్రచారాన్ని అస్త్రంగా వాడుకోవాలని ఆ పార్టీ నేతలు వేస్తున్న స్కెచ్ కు బీజేపీ బ్రేక్ వేసింది. అది కూడా సాక్షాత్తు టీడీపీ అధినేత - నారా చంద్రబాబు నాయుడు రూపంలోనే వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం - దానిపై ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అంతకంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు - ఎంపీ గోకరాజు గంగరాజు - ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు - ఆకుల సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి జరుగుతున్న కారణాలను అన్వేషించాలే తప్ప - ఒకరికొకరు సాకులతో రాజకీయాలు చేసుకుంటే ఉభయులమూ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీ సందర్భంగా వారి మధ్య సీరియస్ గా చర్చలు జరిగాయి. పోలవరం జాప్యానికి కేంద్రానిదే బాధ్యత అన్న ప్రచారం మంచిదికాదని - దానివల్ల ప్రజలు టీడీపీని రక్షించి - తమనేమీ శిక్షించరని - ఇద్దరమూ నష్టపోతామని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేయగా - దానికి ఆయన కూడా అంగీకరించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు తమ పార్టీకీ ముఖ్యమైనందున - తమ పార్టీ సహకారం తప్పనిసరిగా ఉంటుందని వారు సీఎంకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉన్నందున - మీరు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబునాయుడు వారిని కోరారు. అనవసరంగా వస్తున్న లేఖలు - తలెత్తుతున్న సాంకేతిక కారణాలతో ప్రాజెక్టు ఆలస్యమయితే - వ్యయం కూడా పెరుగుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి స్పందించిన బీజేపీ నేతలు.. ఒక్క నయా పైసా ఖర్చు చేయకుండా టెండర్లలో 90 కోట్లు ఎలా పెరిగిందన్న అనుమానాలను నివృతి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని చెప్పారు. కేంద్రం అడిగే లెక్కలకు ఎప్పటికప్పుడు సరైన వివరాలు పంపిస్తే వివాదాలు రావన్నారు. సభలో మీరు పోలవరంపై చెప్పిన అంశాలన్నీ నెపం కేంద్రంపై నెట్టివేసేలా కనిపించిందని, అందువల్ల తాము కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మీరు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడితే ఇద్దరికీ మంచిది కాదని, ఏదైనా సమన్వయంతో ముందుకు వెళితే మంచిదని సూచించారు.
ప్రతి పైసాకు సంబంధించిన ఖర్చుకు లెక్కలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పగా - అన్ని పనులు - లెక్కలు ఆన్ లైన్ లో పెడుతున్నామని బాబు జవాబిచ్చారు. `పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి - రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దడం ద్వారా - రాష్ట్రాన్ని సంపన్నంగా మార్చాలన్న బీజేపీ అభిప్రాయంలో మార్పు లేదు. కానీ మీ ప్రభుత్వ తీరే అందుకు భిన్నంగా ఉంది` అని అసంతృప్తి వ్యక్తం చేశారు. `పోలవరంపై కేంద్రం ఏమీ చేయడం లేదన్న ప్రచారం మీరు చేసినంత మాత్రాన, ప్రజలు మమ్మల్ని శిక్షించి - మిమ్మల్ని రక్షించరు. ఇలాంటి సాకుల ప్రచారంతో ఇద్దరం మునిగిపోతాం` అని స్పష్టం చేయగా - దానితో బాబు కూడా ఏకీభవించారు.
అనంతరం ప్రాజెక్టు కోసం తాము కూడా కేంద్రంతో మాట్లాడతామని - వాస్తవాలేమిటో తెలుసుకుని సహకరించడానికి సిద్ధంగానే ఉన్నామని బాబుకు బీజేపీ నేతల హామీ ఇచ్చారు. అందులో భాగంగా 19 - 20 - 21వ తేదీల్లో తాము ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీ - ఇతర నేతలతో చర్చిస్తామని చెప్పారు. ఇదిలాఉండగా, ఇకపై తరచూ రెండు పార్టీల నేతలు సమన్వయం కోసం భేటీ అవసరాన్ని వ్యక్తం చేశారు.