పవన్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఏ రేంజ్‌లో వివాదం నడుస్తోందో అందరికీ తెలిసిందే. బహిరంగ వేదికపై పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. మీడియా మీటింగ్ పెట్టి మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు ఇంకా కౌంటర్లు వేసుకుంటూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా దూషించుకుంటున్నారు. దీనిపై ప్రముఖ వర్గాలు మౌనంగా ఉన్నప్పటికీ.. పవన్‌కు మిత్రపక్షమైన బీజేపీ మాత్రం పెదవి విప్పడం లేదు. వాస్తవానికి ఏడాదిన్నరగా బీజేపీకి పవన్ మిత్రపక్షంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలూ కలిసి తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేశాయి.
ఇక, స్థానిక ఎన్నికల్లోనూ పవన్-బీజేపీలు కలిసే బరిలోకి దిగాయి. అయితే.. ఇప్పుడు అదే పవన్‌కు ప్రభు త్వం నుంచి తీవ్ర విమర్శలు వస్తే.. మాత్రం.. బీజేపీ స్పందించక పోవడం. ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయాలపై సోషల్ మీడియాలోనూ కామెంట్లు వచ్చాయి. అదీంతో ఎట్టకేలకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్రంలో చక్రంతిప్పుతున్న జీవీఎల్ నరసింహారావు.. పెన్ను కదిపారు. తన ట్టిట్టర్‌లో.. పవన్‌కు మద్దతుగా కాకపోయినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలపై జీవీఎల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నవారు విమర్శలను తట్టుకునే సహనం, ఓపిక ఉండాలని హితువు పలికారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాననే పద్దతి, అహంకారం రాజకీయాల్లో సరికాదని.. ఇలా నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం అని విమర్శించారు. ఈ మేరకు జీవీఎల్ ఓ ట్వీట్ చేశారు. 'జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి' అని జీవీఎల్ నరసింహారావు సూచించారు.
అయితే.. ఓ రేంజ్‌లో పవన్‌పై విరుచుకుపడిన వైసీపీ మంత్రులకు ఇంత సున్నితంగానా సమాధానం చెప్పేది .. ఇదేదో .. మొహమాటానికి చెబుతున్నట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు పేర్ని నాని క్షమాపణ చెప్పాలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. పేర్నిని పిలిచి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంజాయిషీ అడగాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే తప్ప. పవన్‌పై మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండించకపోవడం గమనార్హం.