వరుసగా ఆరోసారి కూడా గుజరాత్‌లో జెండా ఎగరేసిన భాజపాకు అక్కడ ఒక విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తి మిగిలింది. అంతా తానే అయి భాజపాను దేశవ్యాప్తం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సొంతూరు వాద్ నగర్ ఉన్న ఉన్జా నియోజకవర్గంలో మాత్రం భాజపా గెలవలేకపోయింది. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణులు కొంత నిరాశ చెందాయట.
ఈ స్థానం బీజేపీ చేతిలోనే ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పటేల్ నారాయణ్‌భాయ్ లల్లూదాస్ కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో సుమారు 19,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆశా పటేల్‌కు 81,797 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి లల్లూదాస్‌కు 62,268 ఓట్లు వచ్చాయి. 2012లో లల్లూదాస్ 25వేల ఓట్ల మెజారిటీతో ఆశాపటేల్‌పై విజయం సాధించారు.
కాగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనతే అని చెబుతున్నారు అక్కడి పార్టీ నేతలు. రాహుల్‌గాంధీ ఈ నియోజకవర్గంపై బాగా ఫోకస్ చేశారు. మోదీ సొంతూరు వాద్‌నగర్‌కు సమీపంలోని ఉమియా మాతా ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే... ఎలాగైనా గుజరాత్ ను గెలవాలని కాలికి బలపం కట్టుకుని తిరిగిన రాహుల్ గాంధీ ఆ ఫలితం సాధించలేకపోయినా మోదీ సొంత గడ్డను మాత్రం కాంగ్రెస్ పరం చేయగలిగారు. ఎన్నడూ లేని విధంగా రాహుల్ ఈసారి గుళ్లూ గోపురాలు తిరిగినా కూడా గుజరాత్ ప్రజలను మెప్పించలేకపోయారు. 22 ఏళ్ల పాటు బీజేపీ వరుసగా అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో రాహుల్ విఫలమయ్యారనే చెప్పాలి. అయితే, మోదీ సొంతూరిలో గెలవడం గుడ్డిలో మెల్ల అని చెప్పుకోవాలి.