గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో: ఉచిత విద్య, 20 లక్షల ఉద్యోగాలు..

Update: 2022-11-26 14:08 GMT
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ  ఈరోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది, అందులో పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇక్కడ విడుదల చేసిన మేనిఫెస్టోలో పార్టీ బాలికలకు కెజి నుండి పిజి వరకు (కిండర్ గార్టెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు) ఉచిత విద్యను కూడా అందిస్తామని హామీ ఇచ్చింది.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య బీమా కవరేజీని ₹ 5 లక్షల నుంచి ₹ 10 లక్షలకు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను అందులో పేర్కొంది.

ప్రజల నుంచి సేకరించిన సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టోను బీజేపీ నేతలు తయారు చేశారు.ఇక పాకిస్తాన్ కు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ కు ఉగ్రవాద ముప్పు నుంచి భద్రత కల్పించేలా 'యాంటి రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు, రెండు ఎయిమ్స్ సహా కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ వంటి హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.

10వేల కోట్లతో రాష్ట్రంలోని 20వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 10వేల కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాల కల్పన.. మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామని తెలిపింది.

ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు. గుజరాత్ ఆర్థికవ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సంఘ విద్రోహకులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూరిస్తే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాం.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News