ఏపీలో బీజేపీ ‘కేకేఆర్’ ఫార్ములా!

Update: 2020-07-06 11:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసైపోతోంది. ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు శక్తి సామర్థ్యాల గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడుకు టీడీపీ ఏపీలో రోజురోజుకి బలహీన పడుతోంది. ఇదే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో బలపడే అవకాశం కల్పిస్తోందట.. ఏపీలో కులాలు కలిసి వచ్చే సందర్భాలు వచ్చాయని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట..

బీజేపీ వాళ్లు ‘కేకేఆర్’ ఫార్ములాలతో వెళ్తున్నారంటా.. కేకేఆర్ అంటే ‘కమ్మ కాపు రాజు’.. ఈ కులాలను టార్గెట్ చేసి గుంటూరు నుంచి గోదావరి జిల్లాల వరకు ఇదే ఫార్ములా వాడి టీడీపీలో ఉన్న పలుకుబడి నాయకులను బీజేపీలోకి చేర్పించుకోవాలని పెద్ద ఎత్తున ఆ పార్టీలో కసరత్తు జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు ఈ బాధ్యతలను బీజేపీలో వివిధ బడా నేతలకు అప్పగించినట్టు సమాచారం. సుజనాకు కమ్మ నేతలను.. కన్నాకు కాపు నేతలను.. రఘురామకృష్ణం రాజుకు ‘రాజు’ల వర్గం నేతలను తీసుకొచ్చే బాధ్యతను అప్పజెప్పారని ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇలా టీడీపీని నీరుగార్చే బాధ్యతను బీజేపీ భుజాన వేసుకుందని.. ఆ పార్టీని 2023 ఎన్నికల వరకు దిగజార్చేసి ఏపీలో బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోందట.. ఇదే నిజమైతే తెలుగు తమ్ముళ్లు.. వాళ్ల అన్నయ్య చంద్రబాబు పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News