బట్టబయలైన ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ ఫొటోలు

Update: 2022-06-20 13:56 GMT
బాధ్యతగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా చిలక్కొట్టుడు వ్యవహారంలో మునిగితేలుతూ అభాసుపాలవుతున్నారు. ప్రేమ ముసుగులో కొందరిని వంచిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ బీజేడీ నాయకులు అడ్డంగా బుక్కయ్యాడు. ప్రేమ ముసుగులో వంచిచాడని జగత్ సింఘ్ పూర్ జిల్లా తిర్తోల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విజయశంకర దాస్ కు వ్యతిరేకంగా సంచలనాత్మక ఆరోపణలు బహిర్గతం అయ్యాయి.

ఎమ్మెల్యే ప్రియురాలిగా పేర్కొని సోమాలిక దాస్ (29) అనే యువతి జగత్ సింఘ్ పూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఎమ్మెల్యే విజయశంకర దాస్, సోమాలిక ఇరువురి అంగీకారం మేరకు రిజిస్ట్రర్ వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జగత్ సింగ్ పూర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అనుబంధ దస్తావేజులతో వివాహం కోసం ఈ ఏడాది మే 17న దరఖాస్తు దాఖలు చేశారు.

ఈనెల 17తో నెలరోజులు పూర్తి కావడంతో సోమాలిక రిజిస్ట్రార్ ఆఫీసుకు సకాలంలో హాజరైంది. అక్కడ 3 గంటలకు పైగా ప్రియుడి కోసం నిరీక్షించింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నిరుత్సాహ పడింది. ఎమ్మెల్యే వైఖరితో ఒక్కసారిగా షాకైంది.

పూర్తి అంగీకారంతో వివాహం రిజిస్ట్రేషన్ ఖరారు చేసుకున్న సమయానికి హాజరుకాకపోవడం వెనుక అపహరణ లేదా వంచన ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.

తాజాగా ఆదివారం మరో ఆరోపణను తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే మరో ఐదుగురితో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు ఆరోపించింది. దివ్యశంకర దాస్ కు వ్యతిరేకంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతారని తెలిపారు. మరోవైపు ప్రియుడితో చనువుగా తిరిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Tags:    

Similar News