ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో బీజేపీ ఎంపీ , సాధువు అయిన సాక్షి మహారాజ్ కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్తాన్ దేశానికి చెందిన ఫోన్ నంబర్ నుంచి రెండు సార్లు ఫోన్ కాల్ వచ్చినట్టు తెలిసింది. మూడు నిమిషాలు మాట్లాడి చంపేస్తానని బెదిరించాడు.
కాల్ చేసిన పాకిస్తాన్ ఆగంతకుడు.. ఎంపీ సాక్షి మహారాజ్ ఇంటిపై బాంబు వేసి చంపేస్తామంటూ బెదిరించాడు. నా స్నేహితుడు మహ్మద్ గఫార్ ను పోలీసులకు పట్టించావని.. నిన్ను, నీ అనుచరులను పదిరోజుల్లోగా హతమారుస్తాం అంటూ హెచ్చరించాడు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను కూడా చెప్పాడని సాక్షి మహరాజ్ తెలిపారు.
ఈ మేరకు స్థానిక ఎస్పీకి ఎంపీ సాక్షి మహారాజ్ ఫిర్యాదు చేశారు. ‘గజ్వా-ఏ -హింద్’ పేరుతో భారత్ లో ఇస్లామిక్ పాలన స్థాపిస్తామని హెచ్చరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గతంలో కువైట్ కు చెందిన మహ్మాద్ గఫార్ ఇదే ఎంపీ సాక్షి మహరాజ్ ను చంపేస్తానని బెదిరించగా కేసు నమోదైంది. గఫార్ ను యూపీ స్పెషల్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే పగతో అతడి స్నేహితుడు పాకిస్తాన్ నుంచి బెదిరించాడని ఎంపీ సాక్షి తెలిపాడు.