ట్రంప్ తో మోడీ స్నేహం .. బీజేపీ ఎంపీ సెటైర్ !

Update: 2020-11-09 16:40 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తర్వాత అంతటి ప్రాముఖ్యత అమెరికా అధ్యక్ష ఎన్నికలకే వచ్చింది. ప్రపంచ దేశాల పెద్దన్నగా అమెరికాకి పేరు ఉండటంతో అన్ని దేశాలు కూడా అమెరికా ఎన్నికల పై అన్ని దేశాలు కూడా ఎక్కువ ఆసక్తి చూపాయి. ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత , ఓట్ల లెక్కింపులో కూడా చాలా డ్రామా నడిచింది. ఇక ఎట్టకేలకి అమెరికా లో ట్రంప్ శకం ముగిసి బిడెన్ శకం మొదలైంది. ఇది ట్రంప్ కి ఊహించని పరిణామ కావడంతో .. ట్రంప్ ఈ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటె , ట్రంప్ ఓటమిని మోడీకి ముడి పెడుతూ సొంత పార్టీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సెటైర్ విసిరారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ మ‌రోసారి గెలుపొందాల‌ని బీజేపీ కోరుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ అనూహ్యంగా ఓటమి చెందారు. లాక్‌డౌన్‌కు ముందు ట్రంప్ మ‌న దేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ట్రంప్ ఓట‌మి చెందడంతో , ఆ ఓటమి పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సంద‌ర్భంగా బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజా ట్వీట్‌పై బీజేపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇంతకీ అయన ఏమన్నారంటే ... "ప్ర‌ధాని మోడీ అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌న‌కు ట్వీట్ చేసి భార‌త్‌కు ఆయ‌న ఇన్నాళ్లూ మంచి స్నేహితుడిగా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలపాలి. అలాగే వ‌చ్చే గణ‌తంత్ర దినోత్స‌వాల‌కు ప్ర‌త్యేక అతిథిగా ఆహ్వానిస్తే బాగుంటుంది" అని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ట్వీట్ చేశాడు.

వచ్చే ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాటికి అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ట్రంప్ దిగిపోతార‌ని తెలిసి కూడా సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వెట‌కారంగా ట్వీట్ చేశాడ‌ని బీజేపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనితో కావాలనే ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సెటైర్లు వేశాడు అని గుర్రుగా ఉన్నారు.
Tags:    

Similar News