తెలంగాణ బీజేపీ నేతల వ్యూహాలు మారుతున్నాయా? నేతల మధ్య నిన్న మొన్నటి వరకు ఉన్న విభేదా లకు చెక్ పెట్టే దిశగా నాయకులు.. అడుగులు వేస్తున్నారా? హుజూరాబాద్ ఉప పోరులో దక్కిన ఘన విజ యం ఆలంబనగా.. అధికారం దక్కించుకునేందుకు.. ముందస్తు.. వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకులు..విందు రాజకీయాల్లో మునిగిపోయారు. ఎవరి నోట విన్నా.. విందు.. పసందు.. అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి.
సహజంగానే ఏదైనా విజయం దక్కించుకుంటే.. విందులు చేసుకోవడం.. తెలంగాణ సంప్రదాయం.దీనిని ఎవరూ కాదనరు. కానీ.. ఈ విందు వెనుక.. వ్యూహాలు ఉన్నాయనేదే.. ఇప్పుడు చర్చ. రాష్ట్రంలో మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ విజయ పరంపరతో దూసుకుపోతోంది.(దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్‌లో మంచి పట్టు) ఈ నేపథ్యంలో ఈ దూకుడును మరింత పెంచితే.. మున్ముందు.. అధికారం దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది.. బీజేపీ నేతల మాట. అయితే.. దీనికి ప్రధాన అడ్డంకిగా.. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి.
కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు.. సామాజిక వర్గ పోరు.. వంటి బాగానే ఉన్నాయి. వీరిలో కిషన్ రెడ్డి, రాజాసింగ్, బండి సంజయ్, రఘునందన్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ వంటి నేతలు ఉన్నారు. వీరు కనుక ఏకతాటిపై నడిస్తే.. రాష్ట్రంలో పార్టీ మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నాయకులు.. విందు పేరుతో ఒక్కటవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సెంట్రిక్‌గా.. ప్రధానంగా వీరు చర్చిస్తన్నట్టు తెలిసింది. అధికారం దక్కించుకోవడంతోపాటు..కేసీఆర్‌కు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులు. శనివారం సాయంత్రం.. హైదరాబాద్ శివారులో అత్యంత గోప్యంగా భేటీ అయ్యారు. డిన్నర్ పార్టీ చేసుకున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బాద్‌షా, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ హాజరయ్యారు. ఈ విందు డీకే అరుణ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేయడంపైనా.. అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలను మరింత పుంజుకునేలా చేయడంపైనా.. నాయకులు దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం కేసీఆర్.,. బీజేపీని భారీ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీని మరింత ముమ్మరంగా.. కేసీఆర్‌పై విజృంభిచేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ సమావేశం అంతా కూడా కేసీఆర్ చుట్టూతానే తిరగడం గమనార్హం. ఇక, అదేసమయంలో పార్టీలో అంతర్గత విభేదాలను తగ్గించుకోవడంపైనా నాయకులు దృష్టి పెట్టారని సమాచారం.