ఏపీలో బీజేపీ దూకుడు మామూలుగా లేదు. ప్రజల పరంగా.. పార్టీపరంగా.. ఓటు బ్యాంకు పరంగా పరిస్థితి ఎలా ఉన్నా... నాయకుల పరంగా.. కామెంట్ల పరంగా మాత్రం నాయకులు దూకుడుగా ఉన్నారు. దీనికి కారణం.. ఏంటి? ఎందుకు నాయకులు ఇంత దూకుడుగా ఉన్నారు..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరు గా సాగుతోంది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ.. ఎవరిపైనైనా విమర్శలు చేయొచ్చు. కానీ, ఆ పార్టీ కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తుంది.
మరోవైపు.. బీజేపీ నాయకులు వైసీపీని కామెంట్లు చేస్తున్నా.. రాష్ట్రంలో అలజడులు రేపుతున్నారంటూ.. సీఎంపైనే విమర్శలు చేస్తున్నా.. బీజేపీ నేతల జోలికి మాత్రం వెళ్లరు. కానీ, అదేసమయంలో టీడీపీ నేతలు చిన్న మాట అన్నా.. కూడా వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. వారిపై కేసులు పెట్టించడం.. మంత్రులు రంగంలోకి దిగి.. నానా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక, టీడీపీని తీసుకున్నా.. వైసీపీ నేతలపైనా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుంటారు.
అధికార పార్టీ నాయకులపైనా టీడీపీ నాయకులు విరుచుకుపడుతుంటారు. కానీ, అదేసమయంలో బీజేపీ విషయంలో మాత్రం ఫుల్లు సైలెంట్‌గా ఉంటారు. మరీముఖ్యంగా బీజేపీ రాష్ట్ర సారథి.. సోము వీర్రాజు ఇటీవల కాలంలో చంద్రబాబును తూర్పారబడుతున్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం నాశనం అయిందని అంటున్నారు. అయినప్పటికీ.. టీడీపీ నాయకులు ఎవరూ కూడా బీజేపీపైనా..సోముపైనా కూడా పన్నెత్తు మాట అనరు. దీనిని బట్టి.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం ఏంటనే చర్చ ఆసక్తిగా మారింది.
బీజేపీకి అటు టీడీపీ, ఇటు వైసీపీలు బీ టీంలుగా ఉన్నాయనే.. చర్చ జరుగుతుండడం గమనార్హం. లేకపోతే.. వైసీపీ అధినేత, సీఎంపై బీజేపీ నాయకులు కామెంట్లు చేసినా.. వైసీపీ నేతలు స్పందించరు. ఇటు.. టీడీపీ అధినేతపై విమర్శలు చేసినా.. వారు బీజేపీని ఏమనరు. ఈ పరిణామాలను బట్టి.. బీజేపీ విషయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ కూడా బీ టీం మాదిరిగా వ్యవహరిస్తున్నాయనే కామెంట్లు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.