పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా.? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నామని.. ఏపీలోనూ అధికారం రాబోయే దఫా మాదేనని భీంకాలు పలుకుతున్న బీజేపీకి వాస్తవ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. మొన్నటి 2019 ఎన్నికల వేళ బీజేపీకి ఏపీ వ్యాప్తంగా వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా.? అక్షరాల 2,64,303 ఓట్లు. ఇవి ఒక నియోజకవర్గంలో వచ్చే అన్ని ఓట్లు కూడా రాకపోవడం నివ్వెరపరుస్తోంది. విశేషం ఏంటంటే బీజేపీ కంటే కూడా నోటాకు ఏపీలో 401969 ఓట్లు రావడం విశేషం.
నోటాలో సగం వచ్చిన బీజేపీ వచ్చేసారి ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీకి ఏపీలో గడ్డు పరిస్థితి ఉందని తాజా లెక్కలు కుండబద్దలు కొడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీకి 1,56,86,511 ఓట్లు వచ్చాయి. ఇక ఓడిన టీడీపీకి భారీగానే ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి 1,23,03,620 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల తర్వాత జనసేనకు 16.76 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక నాలుగో స్థానం నోటాదే.. ఐదో స్థానంలో కాంగ్రెస్ కు 3.68 లక్షల ఓట్లు రాగా.. ఆరో స్థానంలో బీజేపీకి 2.64 లక్షల ఓట్లు వచ్చాయి.
ఇవీ అసలు బీజేపీ స్టామినాను - సామర్థ్యాన్ని తేల్చిచెబుతున్నాయి. తాజాగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా ప్రతిపక్ష టీడీపీని తుత్తునియలు చేసి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని సవాల్ చేస్తున్నారు. అయితే ఒక నియోజకవర్గ ఓట్లన్ని కూడా తెచ్చుకోని బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీకి - వైసీపీకి ప్రత్యామ్మాయం బీజేపీ అని డప్పు కొడుతున్న బీజేపీ నేతలకు అది అస్సలు సాధ్యం కాదని క్షేత్ర స్థాయి పరిస్థితులతో తేటతెల్లమవుతోంది.
బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీలు ఇటీవలే చేరారు. వారు పెద్ద బిజినెస్ మ్యాన్ లు - వారిపై ఐటీ - ఈడీ కేసులు నమోదయ్యాయి. పార్టీ మారకపోతే తమ వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోతాయనే భయంతోనే వారు పార్టీ మారుతున్నారనే టాక్ నడిచింది. స్వతహాగా కష్టపడి రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నా నాయకులు ఒక్కరు కూడా బీజేపీ వైపు చూడడం లేదు.
నలుగురు చేరగానే వాపును చూసి బలపనుకొని ఏపీలో ఎదుగుదామని కలలుగంటున్న కమలం పార్టీకి ఆ ఆశలు అయితే నెరవేరేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు - పొలిటికల్ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులు - అలిగేషన్స్ ఉన్న వారు తప్పితే బీజేపీలో చేరడానికి ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం చూస్తే ఆ పార్టీ ప్రచారం ఊరు గొప్ప పేరు దిబ్బలా ఉందంటున్నారు. బీజేపీకి ఏపీలో బలపడే సూచనలు అయితే ఇప్పట్లో లేవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.