నిబంధనలు పాటించలేదని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో గ్రానైట్ యజమానులకు భారీగా జరిమానాలు విధించారు. ప్రకాశం జిల్లాలో క్వారీలలో అక్రమ తవ్వకాల విషయమై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా చేస్తున్న వారిపై రూ.వందల కోట్ల మేర భారీ జరిమానాలను విధించింది. దీనిలో ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ విషయం ప్రకాశం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దెబ్బకు గ్రానైట్ రంగం షాక్ కు గురయ్యింది.
ప్రకాశం జిల్లా బల్లికురవలో క్వారీ నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ గరికపాటి మోహన రావుకు చెందిన ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కు రూ.286 కోట్లు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీలకు ఏకంగా రూ.303 కోట్లు జరిమానా విధించారు. ఇక్కడే ఉన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావుకు చెందిన క్వారీలకూ భారీగా జరిమానాలు వేసినట్టు తెలుస్తోంది. ఆ విషయం బయటకు రాలేదు. నిబంధనలు పాటించలేదని, అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని తదితర ఆరోపణలతో వారిపై భారీ జరిమానాలు విధించారు.
మాజీమంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్యంగా రెండు రోజులుగా మైనింగ్ అధికారుల చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా శిద్దా రాఘవరావు కంపెనీలు ఉన్న చీమకుర్తి ప్రాంతంపై అధికారులు దాడులు చేశారు. ఈ ప్రాంతంలోని 35 గెలాక్సీ గ్రానైట్ క్వారీల యజమానులకు రూ.1,200 కోట్ల విలువైన జరిమానాలు వేశారు. ఈ మేరకు వారందరికీ ఆ జరిమానా నోటీసులు గురువారం జారీ చేశారు. అనంతరం శుక్రవారం గొట్టిపాటి, గరికపాటి మోహనరావు క్వారీలు ఉన్న బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాలకు ఈ నోటీసులు పంపించారు.
బల్లి కురవ వద్ద ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఏళ్లుగా కొనసాగుతున్న దానిపై భారీగా జరిమానా విధిస్తూ నోటీసులు రావడంపై ఎంపీ గరికపాటి ఆశ్చర్యానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బల్లికురవ, గురిజేపల్లి లో సుమారు 22 క్వారీలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో కలిపి 57 క్వారీలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇన్ని క్వారీలపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం తో గ్రానైట్ వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ చర్యలపై గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే సమావేశం నిర్ణయించి కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు. క్వారీలకు జారీ అయిన నోటీసులను వాటి యజమానులకు అందించే ప్రక్రియ మొదలైందని గనుల శాఖ ఏడీ జగన్నాథరావు చెప్పారు.అయితే వారి వాదన ఇలా ఉంది.. బల్లికురవ లో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడికి ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ ఉంది. తనిఖీల్లో అక్కడ అనేక లోపాలు ఉన్నా కూడా గుర్తించకుండా కేవలం తమపై చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అతడికి కేవలం రూ.70 కోట్ల జరిమానా మాత్రమే విధించి తమకు భారీ ఎత్తున జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మరో ప్రముఖ రాజకీయ నాయకుడి క్వారీ లో అసలు తనిఖీలే నిర్వహించ లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి బంధువైన రాష్ట్రస్థాయి నాయకుడి జోక్యంతో ఆ క్వారీ వైపు వెళ్లలేదని పేర్కొంటున్నారు. ఇది పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు.