ఒకవైపు ఏపీ ప్రత్యేక హోదాతో ఆంధ్రుల్లో ఆగ్రహాన్ని చవిచూస్తున్న భారతీయ జనతాపార్టీ తన భవిష్యత్ ప్రణాళికల విషయంలో మాత్రం ఏ మాత్రం తొట్రుపాటు కాకుండా ముందుకు సాగుతోంది. ఏకంగా వార్డు స్థాయి ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ ముందస్తుగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఉత్తేజం నింపుతోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాల గురించిన అంశం.
నగరపాలక సంస్థల్లో ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. విశాఖ నగరంలో ఒక ఎంపీ - ఒక ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు విశాఖ నగరంలో పార్టీ బలాన్ని పెంపొందించుకోవాలని భావిస్తున్నారు. రాబోయే నగర పాలక సంస్థ ఎన్నికలు తమ పార్టీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందన్న అంశం తెలిపే ఒక గీటురాయిగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెదేపాతో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు డిమాండు చేయాలని భావిస్తున్న ఆ పార్టీ నేతలు కేటాయించిన సీట్లలో గెలవకపోతే ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. తెదేపాతో పొత్తు ఉన్నప్పటికీ భాజపా తనకు కేటాయించిన వార్డులు గెలవకపోతే పార్టీ బలహీనపడిన సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు అత్యంత వ్యూహాత్మకంగా, తగిన ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రశిక్షణ మహాభియాన్’ కార్యక్రమానికి సుమారు 500 మంది వరకు కిందిస్థాయి శ్రేణులు హాజరై పార్టీ భావజాలంపై అవగాహన పెంచుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కార్యకర్తలకు ఈ తరహాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. కానీ తాజాగా ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వార్డు స్థాయి నాయకులకు స్ఫూర్తి నింపారు. వారిని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు విస్తృత అవగాహన కల్పించారు.
బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకెళ్లడం, వివిధ పథకాలకు అర్హులుంటే వారికి ఆయా పథకాల కారణంగా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవడాన్ని ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలని నాయకులు సూచించారు. జనధన్ - రూ.12లకే ప్రమాద బీమా తదితర పథకాలు చిన్నగా కనిపించినా ప్రమాదం జరిగినప్పుడు ఆయా పథకాలు వారి కుటుంబసభ్యులను ఆదుకుంటాయని పేర్కొన్నారు. కార్యకర్తలు ఆయా పథకాల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సూచించారు. వార్డుస్థాయి నాయకులు తమతమ వార్డుల పరిధిలోని భాజపా సభ్యులను కలవాలని పలువురు నాయకులు ఉద్భోదించారు. పార్టీ సభ్యత్వం నిర్వహించినప్పుడు విశాఖ నగరంలో 4.23 లక్షల మంది స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారని గుర్తుచేశారు. ఆయా మొత్తం సభ్యుల్లో ఎంత మంది ఏవార్డులో ఉంటున్నారో తెలుసుకుని వారిని కలిసి పార్టీ బలోపేతానికి వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. వారికున్న సమస్యలను పరిష్కరించడానికి శ్రద్ధ చూపాలని నాయకులు ఉద్భోద చేశారు. సభ్యత్వం ఇచ్చి పనైపోయిందని కూర్చుంటే ఉపయోగం ఏముంటుందో ఆలోచించాలని కోరారు. వార్డుస్థాయిలో నాయకులు ముందుగా వార్డుల్లో తమ పార్టీవైపు మొగ్గుచూపేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలో ఆగస్టు 14వ తేదీ నుంచి వారం పాటు నగరవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమం ఏ విధంగా చేయాలన్న అంశాన్ని త్వరలో ఖరారు చేస్తామని... దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. మొత్తంగా ఎన్నికలకు ఒకింత ముందస్తుంగానే సిద్ధం అవుతుండటంతో విశాఖ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.