ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. మొహమాటాల్ని వదిలేసి మరీ విమర్శలు చేయటం.. ఘాటు ఆరోపణలు చేయటం మామూలే. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల మధ్య నెలకొనే రాజకీయ వైరం తరహాలోనే.. జాతీయ స్థాయిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మోడీ లాంటి నేత ప్రధానిగా ఎన్నికల రేసులో నిలిస్తే.. ఆ మాత్రం దూకుడు లేకుండా ఎందుకు ఉంటుంది.
మరికొద్ది రోజుల్లో రాహుల్ సోదరి ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు అధికారికంగా చేపట్టనున్న వేళ.. ఆమె భర్తపై బీజేపీ ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేయటం షురూ చేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాద్రాకు మనీలాండరింగ్ తో పాటు.. చాలా రక్షణ ఒప్పందాల్లోనూ సంబంధాలు ఉన్నట్లుగా ఆయన ఆరోపించారు.
వివిధ కంపెనీల ద్వారా వాద్రా భారీగా సొమ్మును అక్రమంగా మళ్లించినట్లు ఆయన చెప్పారు భారత వాయుసేనకు చెందిన పిలాటస్ ట్రైనర్ విమానం కొనుగోలు ఒప్పందంలో కూడా వాద్రాకు సంబంధం ఉన్నట్లు ఆయన చెప్పారు.ఒకప్పుడు రోడ్డుపతి లాంటి వాద్రా.. ఇప్పుడు క్రోర్ పతి ఎలా అయ్యారని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట్నించి బెయిల్ కుటుంబంగా అభివర్ణించిన ఆయన.. కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా ఇద్దరు నేరగాళ్ల పోస్టర్లను ఏర్పాటు చేయలంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధం ఉన్న రాహుల్.. ఈ కేసులో నెంబర్ వన్ అని.. ఆడీ సమక్షంలో హాజరు కానున్న రాబర్ట్ వాద్రా క్రిమినల్ నెంబర్ టూ అని చెప్పారు. వాద్రాను ప్రశ్నించాల్సి ఉందనంటూ ఈడీ డైరెక్టరేట్ తెలిపిందని.. ఈ అంశంపై ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆయన ఆశ్రయించిన వైనాన్ని గుర్తు చేశారు. మొత్తంగా బావ.. బావమరదులు ఇద్దరిని కలిపి టోకుగా విమర్శలు చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కాంగ్రెస్ నేతల కడుపు మండిస్తోంది.