ఏపీ పై బీజేపీ వ్యూహం దొడ్డిదారేనా..!

Update: 2019-10-06 01:30 GMT
రాజ‌కీయంగా ఎద‌గాలి.. పైచేయి సాధించాలి. ఆర్ ఎస్ ఎస్ విధానాలు, బీజేపీ సిద్ధాంతాల‌ను దేశ‌వ్యాప్తం చేయాలి. ఒకే మ‌తం-ఒకే దేశం నినాద‌మే మార్మోగాలి! ఇదీ నేడు బీజేపీ ఎంచుకున్న అతిపెద్ద ల‌క్ష్యం. ఈ ల‌క్ష్య సాధ‌న‌లో నిజంగానే ఓర్పుగా, నేర్పుగా అంద‌రికీ ఆమోద‌యోగ్యంగా ఉంటే ఎవ‌రికీ ఇబ్బంది కాదు. కానీ, వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌ను ప‌క్క‌న పెట్టి దొడ్డిదారి రాజ‌కీయాలు చేయ‌డ‌మే ఇప్పుడు అంద‌రినీ ఆలోచింప చేస్తున్న ప‌రిణామం. ఈ క్ర‌మంలోనే క‌శ్మీర్ విష‌యంలో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసినా, రెండు రాష్ట్రాలుగా విడ‌దీసినా.. బీజేపీ వ్యూహం దేశంలో ఎద‌గ‌డ‌మే. ఈ క్ర‌మంలోనే వివిధ రాష్ట్రాల్లోనూ దొడ్డిదారి రాజ‌కీయాలు చేయ‌డం ద్వారా.. అధికారాన్ని అందిపుచ్చుకుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ప‌క్క‌నే ఉన్న క‌ర్ణాట‌క‌, గోవాల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన తీరు మ‌న‌కు క‌మ‌లం పార్టీ కుయుక్తుల‌ను క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ద‌క్షిణాదిలో ఎద‌గాల‌నే పార్టీ కాంక్ష‌,అధికారంలోకి ఎలాగైనా వ‌చ్చేయాల‌నే దుగ్ధ కార‌ణంగా ప్ర‌జాస్వామ్య యుతంగా ఏర్పాటైన ప్ర‌భుత్వాల‌ను మూడునాళ్ల‌కే ముప్పు తిప్పులు పెట్టిన ప‌రిస్థితి క‌ర్ణాట‌క‌లో మ‌నం చూశాం. ఇప్పుడు తెలంగాణ‌, ఏపీల‌పై కూడా బీజేపీ ఇదే త‌ర‌హా వ్యూహంతో పావులు క‌దుపుతోంది. తెలంగాణ‌లో ఏకంగా ఓ నాయ‌కుడికి కేంద్రంలో కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. ఆ రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌క్కాగా ప్లాన్ సిద్ధం చేసుకుంది. అక్క‌డ ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగేళ్ల టైం ఉన్నా బీజేపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం క్షేత్ర‌స్థాయిలో మ‌రో ఆరు నెల‌ల్లోనే ఎన్నిక‌లు అన్నట్టుగా ప‌ని చేస్తున్నారు.

ఇక‌, ఏపీ విష‌యానికివ‌స్తే. ఇక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు పూర్తి మాండేట్ ఇచ్చారు. అప్ర‌తిహ‌త విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. అయిన‌ప్ప‌టికీ.. అధికారంలోకి రాలేక పోయామ‌నే బాధ బీజేపీని ప‌ట్టిపీడిస్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. నిజానికి ఇక్క‌డ గ‌త ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌ట్టుమ‌ని ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేక పోయారు క‌మ‌ల నాధులు. అయినా కూడా ప్ర‌భుత్వాన్ని శాసించాల‌ని, త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకోవాల‌ని భావిస్తుండ‌డం ఇటీవ‌ల ఎక్కువైంది.

ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న టీడీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు ఇత‌ర కీల‌క నాయ‌కుల‌ను త‌మ పార్టీలోకి లాగేసుకుంటోన్న బీజేపీ ఇప్పుడు జ‌గ‌న్‌పై క‌క్ష్యా పూరితంగానే టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉంది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై గ‌త యూపీఏ పాల‌న‌లో జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా న‌మోదైన కేసుల‌ను అడ్డు పెట్టుకుని.. ఏపీలో ఎద‌గాల‌ని భావించ‌డం ఏమేర‌కు సమంజ‌స‌మో.. బీజేపీ నేత‌లు చ‌ర్చించుకుంటే మంచింద‌న్న అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. నేడు జ‌గ‌న్‌ను కంట్రోల్ చేసేందుకు బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా రేపు ప్ర‌జాకోర్టు అనే ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏంటో.. తెలిసిన నాడు.. అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌డం త‌థ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బీజేపీ ఏపీలో అక్క‌డ వ‌ర‌కు ఎదిగే సీన్ ఉందా ? అంటే ఆ పార్టీకే తెలియాలి.
Tags:    

Similar News