అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పరిణామాలు బీజేపీకి అనూహ్య రీతిలో కలిసి వచ్చాయి. ఆ రాష్ట్రంలో కమళం సర్కార్ ఏర్పాటు కావడానికి సర్వం సిద్ధమైంది. అధికార పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి 33 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీ పంచన చేరడంతో రాష్ట్రంలో బీజేపీ కొత్త సర్కార్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 33 మంది ఎమ్మెల్యేలు అధికార పీపీఏ నుంచి వైదొలగడంతో ఆ పార్టీకి ఇప్పుడు 60 మంది సభ్యుల అసెంబ్లీలో కేవలం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ఎమ్మెల్యేలు 33 మంది బీజేపీలో చేరారు. ఇంకా ఆపార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు. భారీగా బీజేపీలో ఎమ్మెల్యేలు చేరడంతో అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపుతిరిగాయి. కాగా, నిన్న సీఎం ఫెమా ఖండూ సహా ఏడుగురిని పీపీఏ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామంతో బీజేపీనే అధికార పగ్గాలు చేపడుతుందని, ఫెమాఖండు సీఎం అనే విషయం స్పష్టమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/