బీజేపీ స్కెచ్ రెడీ చేస్తోందా.. !

Update: 2019-11-03 04:49 GMT
ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితు ల్లోనూ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖ‌రాకండీగా చెప్తుండ‌గా - ప్రభుత్వం దిగివ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కూ స‌మ్మెను ఆపేది లేద‌ని యూనియ‌న్ నేత‌లు తేల్చి చెబుతున్నారు.  దీంతో యూనియ‌న్ నేత‌లు - ప్ర‌భుత్వం మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెలకొంది. ఈక్ర‌మంలోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ హుటాహుటిన‌ ఢిల్లీకి  వెళ్లి - తిరిగి వ‌చ్చిన వెంట‌నే స్వ‌రం పెంచ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.   

ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు కాంగ్రెస్‌ - బీజేపీ - వామ‌ప‌క్షాల‌తో స‌హా ప‌లు ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ఇస్తున్నప్పటికీ -  అన్ని పార్టీల కంటే బీజేపీ స‌మ్మెను ఓన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే  అధికార టీఆర్ ఎస్‌ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే బీజేపీ వ్యూహాన్ని ముందే ప సిగ‌ట్టిన కేసీఆర్ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అస‌లు కేంద్రం తెచ్చిన చ‌ట్టం ప్ర‌కార‌మే నిర్ణ‌యాలు తీసుకునే అధికారం రాష్ట్రాల‌కి ఉంటుంద‌ని - ఆర్టీసీ స‌మ్మె మొదలైనప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు.

అయితే, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహిక‌ల్ చ‌ట్టంలో ఆర్టీసీని ప్రైవేట్‌ ప‌రం చేయాల‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని బీజేపీ నేత‌లు ప్ర‌భుత్వానికి కౌంట‌ర్ ఇస్తున్నారు.  చ‌ట్టంలో ఆర్టీసీని ప్రైవేటుప‌రం చేయాల‌నీ - లేదా ఉన్న ఉద్యోగుల‌ను తొల‌గించెయ్యొచ్చు - ఆస్తుల‌ను అమ్ముకోవ‌చ్చు అనే అంశాలు లేవంటూ ధీటుగా బ‌దులిస్తున్నారు.  మేం కేంద్రం తెచ్చిన చ‌ట్టం ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నామంటూ కేసీఆర్ అంటున్నా… త‌మ‌పై నింద ప‌డ‌కుండా మొద‌ట్నుంచీ బీజేపీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. ఈక్ర‌మంలోనే తాజాగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌ను తాము మాత్ర‌మే ప‌రిష్క‌రించ‌గ‌లం అనే ఒక వాతావర‌ణాన్ని క్రియేట్ చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆర్టీసీ జేయేసీ నేత‌ల్ని ఢిల్లీకి తీసుకెళ్లి - కేంద్రానికి ఫిర్యాదు చేయించే ప‌నిలో ల‌క్ష్మ‌ణ్ ఉన్నట్లు స‌మాచారం. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌లు 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల ప్రోత్భ‌లంతోనే ఈ టూర్ ఫిక్స్ అయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం మొండి వైఖ‌రితో ముందుకు వెళ్తోంది కాబ‌ట్టి, ఈ అంశంలో కేంద్రం జోక్యానికి ఉన్న అన్ని మార్గాల‌నూ వెతికే ప్ర‌య‌త్నంలో బీజేపీ  ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై యాక్ష‌న్ ప్లాన్‌ కు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News