మోడీకి న‌ల్ల బెలూన్ల స్వాగ‌తం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి!

Update: 2022-07-04 08:03 GMT
భీమ‌వ‌రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ప‌లు చోట్ల  కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీల నేత‌లు.. నల్ల బెలూన్లు ఎగురవేసి నిర‌స‌న తెలిపారు.  గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్ల బెలూన్లతో కాంగ్రెస్ నేత‌లు నిరసన తెలిపారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ నేత సుంకర పద్మశ్రీతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మాదిగ హ‌క్కుల పోరాట స‌మితి..ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు కూడా బ్లాక్ బెలూన్లు ఎగ‌రేశారు.

దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప‌శ్చిమ గోదావరి జిల్లాఆలోని జంగారెడ్డి గూడెంలో నల్ల బెలూన్లతో కాంగ్రెస్‌ నిరసన తెలిపింది. ఈ క్ర‌మంలో అక్క‌డ నుంచి భీమవరం బయల్దేరిన నాయకులను  పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ  జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు.

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది శూన్యమంటూ ఆరోపించా రు. మోడీ పర్యటనకు నల్ల బెలూన్లతో వెళుతుండగా జెట్టి గురునాథ్ రావును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు.

సోము ఫైర్‌..

ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన సందర్భంగా  భీమవరం బయలుదేరిన సందర్భంగా గన్నవరం విమానాశ్ర యం సమీప ప్రాంతం నుండి కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేశాయ‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్  సోము వీర్రాజు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.  మోడీ రాష్ట్ర పర్యటన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా "భారీ కుట్రకు" పాల్పడినట్టు తెలుస్తోంద‌న్నారు. ఈ సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

ఈ సంఘటన వెనుక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన పై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనన్నట్లు సోము వీర్రాజు తెలిపారు.

ఎందుకు నిర‌స‌న‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం.. పోల‌వ‌రం నిదులు స‌క్ర‌మంగా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం.. రాజ‌ధానిపై ఉలుకు ప‌లుకు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం.. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌క‌పోవ‌డం.. వంటి కార‌ణాల‌తోనే... ప్ర‌ధానికి నిర‌స‌న తెలిపిన‌ట్టు ఆయా పార్టీల వ‌ర్గాలు పేర్కొన్నాయి.
Tags:    

Similar News