సాంకేతికత పెరిగేకొద్దీ భిన్నమైన అవసరాలకు అది ఉపయోగపడుతోంది. చివరికి ఆ సాంకేతికత మనిషినే పరిగెత్తిస్తోంది. సాధారణంగా అథ్లెట్లు పరిగెత్తాలంటే షూస్ కావాలి.. లక్ష్యం ఎంత దూరంలో ఉందో తెలియాలి.. వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఇన్నీ అనుకూలంగా ఉన్నా.. అథ్లెట్లు ఏదో ఒక విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. అలాంటిది ఒక అంధుడిని ట్రాక్ మీద పరిగెత్తమంటే!! చాలా కష్టం. ఎందుకంటే ముందున్న అవరోధాలెంటో అతనికి తెలియదు.. తన లక్ష్యం ఎంత దూరంలో ఉందో తెలియదు. మొత్తం మీద అతనికి తానెక్కడున్నాడో అస్సలూ తెలియదు. కానీ సిమోన్ వైట్ క్రాఫ్ట్ అనే అథ్లెట్ మాత్రం కళ్లు లేకపోయినా పరిగెత్తేస్తున్నాడు. ఎలాంటి దూరాలనైనా ఛేదిస్తున్నాడు. దీనికి కారణం సాంకేతికత. అతన్ని పరిగెత్తిస్తోంది ఒక యాప్! ఈ బ్లైండ్ ఆల్ట్రా మారథాన్ రన్నర్ యాప్ సాయంతో పరిగెత్తుతూ సాంకేతికత తనకు ఎంతగా ఉపయోగపడుతుందో చాటి చెబుతున్నాడాయన.
వ్యాధి కారణంగా 18 ఏళ్ల వయసులోనే రెండు కళ్లూ పోగొట్టుకున్న వైట్ క్రాఫ్ట్... జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. కళ్లు పోయినా అథ్లెటిక్స్ పై ఉన్న ఇష్టాన్ని మాత్రం వైట్ క్రాఫ్ట్ పోగొట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే టెక్నాలజీని నమ్ముకున్నాడో వైట్ క్రాఫ్ట్ జీవితం మారిపోయింది. ఐబీఎం కంపెనీ సాయం చేయడంతో వైట్ క్రాఫ్ట్ కల నెరవేరింది. అతను పరుగు పందెల్లో పాల్గొనడానికి ప్రత్యేకించి ఒక యాప్ ను తయారు చేసింది ఐబీఎం సంస్థ. ఈ యాప్ పేరు ఈఆస్కాట్. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే పరుగు పందెంలో పాల్గొనేటప్పుడు ముందు ఏం అవరోధాలున్నాయో చెబుతుంది. అంతేకాదు లక్ష్యం ఎంత దూరంలో ఉందో చెబుతుంది. జీపీఎస్ సాంకేతికతో తయారైన ఈ యాప్.. ఇప్పుడు వైట్ క్రాఫ్ట్ కు పెద్ద వరంగా మారింది. ఈ యాప్ పేరును వైట్ క్రాఫ్ట్ కు ఎప్పూడూ తోడుగా ఉండే ఆస్కాట్ పేరు మీద తయారు చేయడ విశేషం.
ఈ యాప్ ను మరింత మెరుగుపరచాల్సి ఉందని.. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కళ్లు లేని క్రీడాకారులకు మాత్రమే కాక అందరికి అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని ఐబీఎం చెబుతోంది. యాప్ సాయంతో పరిగెత్తుతూ సత్తా చాటుతున్న వైటక్రాఫ్ట్ ఇప్పుడు అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ఈ యాప్ ను ఉపయోగించి సహారా ఎడారిలో అత్యంత క్లిష్టమైన రేసులో పాల్గొని శభాష్ అనిపించాడు వైట్ క్రాఫ్ట్. ఐతే ఈ రేసును పూర్తి చేయకపోయినా భవిష్యత్ లో సత్తా చాటుతానని చెబుతున్నాడీ ధీశాలి.