గదిలో రక్తపు మరకలు.. షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..

Update: 2022-03-07 04:27 GMT
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో థాయ్ లాండ్ పోలీసులు తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఆస్ట్రేలియా స్పిన్నర్, మాజీ ప్లేయర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందడం క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది.  హాలీడేస్ కు ఎంజాయ్ చేసేందుకు థాయ్ లాండ్ వచ్చిన  52 ఏళ్ల వార్న్ ఎవరూ ఊహించని విధంగా విగత జీవుడై క్రీడాలోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అక్కడి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతడు గుండెపోటుతో మరణించినట్లు తేలింది.

తాజాగా షేన్ వార్న్ మరణంపై అదే పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ మరణాన్ని కేసుగా నమోదు చేసిన థాయ్ లాండ్ పోలీసులు అతడు బస చేసిన విల్లాలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.

మీడియా కథనాల ప్రకారం.. థాయ్ పోలీసులు వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్టు సమాచారం. అతడి రూంలోని ఫ్లోర్ పై, టవల్స్ పై రక్తం గుర్తులు కనిపించినట్లు థాయ్ పోలీసులు వెల్లడించారు. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి.

గుండెపోటుతో కిందపడిన సమయంలో అతడికి ఏమైనా గాయం అయ్యిందా? అందువల్లే గదిలో రక్తపు మరకలు ఏర్పడ్డాయా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వార్న్ మరణించే సమయంలో విల్లాలో అతడితోపాటు అతడి  ముగ్గురు స్నేహితులు అక్కడే ఉన్నారు. గుండెపోటుతో కుప్పకూలిన షేన్ వార్న్ ను బతికించడానికి ముగ్గురు స్నేహితులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు 20 నిమిషాలు సీపీఆర్ ఇచ్చి బతికించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News