ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థగా పేరున్న బోయింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని భారతీయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్15 యుద్ధ విమానాల ప్రాజెక్టును ఒక భారతీయుడికి అప్పజెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ప్రత్యుష్ కుమార్ కు ఎఫ్-15 ప్రాజెక్టును ఇస్తున్నట్లుగా బోయింగ్ పేర్కొంది. ఐఐటీలో విద్యాభాస్యం అనంతరం మాస్సాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్ డీ అందుకున్న ప్రత్యూష్.. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్15 యుద్ధ విమానాల వ్యాపార వ్యవహారాల్ని చూసుకోనున్నట్లుగా బోయింగ్ పేర్కొంది.
ప్రత్యూష్ అసాధారణమైన వ్యక్తి అని.. అతడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎఫ్15 వ్యాపారాల్ని చూసుకోనున్నట్లుగా బోయింగ్ అంతర్జాతీయ విభాగం అధ్యక్షుడు మార్క్ అలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బోయింగ్ భారత విభాగానికి చీఫ్ గా ఉన్న ప్రత్యూష్ హయాంలోనే బోయింగ్ అసాధారణమైన పనితీరును ప్రదర్శించింది. మనోడి హయాంలోనే బెంగళూరులో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్రాన్ని.. హైదరాబాద్‌లో టాటాతో కలిసి అపాచీ.. చినోక్ హెలికాఫ్టర్ల బాడీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇవే కాకుండా పీ-8 యుద్ధ విమానాల్ని కూడా భారత్ అమ్మింది. బోయింగ్ సంస్థలో కీలకమైన స్థానాన్ని అందుకున్న వ్యక్తి మనోడు కావటంపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో కీలక స్థానాల్లో మనోళ్లు ఉండగా.. తాజాగా ఒక ప్రముఖ వైమానిక కంపెనీలో కీలక బాధ్యతలు మనోడికి దక్కటం భారత యువతకు మరింత స్ఫూర్తిని రగిలిస్తుందని చెప్పక తప్పదు.