టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే 'అంతేగా.. అంతేగా'

Update: 2019-02-16 16:49 GMT
సాధారణంగా భార్యలు సర్పంచులు - ఇతర ప్రజాప్రతినిధులుగా ఉంటే భర్తలు పెత్తనం సాగించడం చూస్తుంటాం. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత అయిన బొజ్జల గతంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో తెదేపా నేతలు - అధికారులపై ఎమ్మెల్యే కంటే ఆయన భార్య బృందమ్మ పెత్తనం ఎక్కువైందని పార్టీలోనూ - ప్రతిపక్షాల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి.
   
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం - ఆకస్మిక తనిఖీలు చేయడం.. బదిలీలు చేయించడం వంటి పనులతో ఆమె తెగ బిజీగా ఉన్నారట. ఒక్కోసారి బొజ్జల ఆమె వెంట ఉంటుండగా... ఆయన లేకుండా కూడా ఆమే ఎమ్మెల్యే హోదాలో హల్ చల్ చేస్తన్నారట. హాస్టళ్లను తనిఖీ చేయడం వంటి పనులు ఆమె చేస్తుంటే అక్కడక్కడా అధికారులు హాజరుకాకపోతే.. తనకు ప్రోటోకాల్ ప్రకారం అంతా సక్రమంగా సాగాలని ఆమె హుకుం జారీ చేస్తున్నారట. దీంతో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డా.. లేదంటే బృందమ్మా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.
   
బృందమ్మ హడావుడి ఎంతవరకు వెళ్లిందంటే.. ప్రభుత్వం డ్రాక్రా మహిళలక పంపిణీ చేస్తున్న చెక్కులను కూడా ఆమే అందజేస్తున్నారట. ఇటీవల డ్రాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో బృందమ్మే కనిపిస్తున్నారని... ఇదేం పద్దతని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బృందమ్మ పెత్తనం గురించి పలువురు అధికారులు బొజ్జల దృష్టికి తీసుకువెళ్లగా ఆయన మాత్రం ‘అంతేగా.. అంతేగా’ అంటున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News