మనదేశంలో మాల్యా వారసులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వ్యాపార కార్యకలాపాల్ని కొనసాగించిన ఈ మాల్యా రాయుడు పలు బ్యాంకులు వద్ద నుంచి రూ. 9 వేలకోట్ల రుణాల్ని పొందాడు. ఆ రుణాల్ని కట్టలేక మార్చి2న దేశ వదిలి పారిపోయి లండన్ లో తలదాచుకున్నాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ..పలు కోర్టుల్లో తాను అమాయకుడినంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఐపీఎల్ ఛైర్మన్ గా ఉన్న లలిత్ మోడీ పై ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ) విచారణకు ఆదేశించింది. ఐపీఎల్ లో మోసాలకు పాల్పడుతూ వేలకోట్లు అర్జించాడనే ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయాడు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు నీరవ్ మోడీ తెరపైకి వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన డైమండ్ బిజినెస్ మ్యాన్ నీరవ్ మోడీ ‘లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ ఓయూ)’ల ద్వారా కుట్ర పన్నిపంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ. 11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు. అయితే ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన వెంటనే అరెస్ట్ చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేశాడు.
అయితే బ్యాంకుల నుంచి ఇన్ని వేలకోట్లు మోసానికి పాల్పడ్డ మోడీ బాలీవుడ్ ఫేమస్ యాక్టర్లతో తన వ్యాపారాన్ని దేశ- విదేశాలకు విస్తరించేవారు. ప్రియాంక చోప్రా - కరీనా కపూర్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - సోనమ్ కపూర్ - లిసా హాయ్డన్ తో పాటు బాలీవుడ్ నుండి మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. 2107లోనే మోడీ వ్యాపారానికి బ్రాండ్ అంబాసీడర్ గా ఉన్న తనని మోసం చేశాడని ప్రియాంక చోప్రా ఆరోపించింది. ఇదిలా ఉండగా పీఎన్బీ కుంభకోణంపై ఈడీ - సీబీఐ - సీఐడీలు విచారణ జరుపుతుంది . అయితే భాగంగా మోడీకి బ్రాండ్ అంబాసీడర్లుగా ఉన్న హీరోయిన్లు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.