అత‌డికి 56 - ఆమెకు 14... పెళ్లి స‌క్ర‌మ‌మేన‌ట‌

Update: 2019-05-08 01:30 GMT
నిజ‌మే... ఆ భార్య చ‌నిపోయిన ఆ ముస‌లోడికి అక్ష‌రాల 54 ఏళ్లు. మైనారిటీ కూడా తీర‌ని ఆ బాలిక‌కు కేవ‌లం 14 ఏళ్లే. వీరిద్ద‌రికీ పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత కోర్టు మెట్లెక్కింది. అంతిమంగా కోర్టు కూడా ఈ పెళ్లికి గ్రీన్ కార్డేసింది. మైనారిటీ తీర‌ని బాలిక‌ను ముస‌లోడికి ఇచ్చి పెళ్లి చేస్తే... ఖండించడంతో పాటు ముస‌లోడితో పాటు పెళ్లి పెద్ద‌ల‌ను బొక్క‌లో తోయాల్సింది పోయి... గ్రీన్ కార్డేసిన కోర్టు కూడా మామూలు కోర్టు కాదు. దేశంలోనే పేప‌రుగాంచిన‌ బాంబే హైకోర్టు. నిజ‌మా? అంటే... బాంబే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాసనం సోమ‌వారం తీర్పు వెలువ‌రించాక నిజం కాద‌ని ఎలా చెప్పేది. నిజ‌మే మ‌రి. దేశ న్యాయ చ‌రిత్ర‌లోనే ఇలాంటి అరుదైన తీర్పు రావ‌డం ఇదే తొలిసారేమో.

అయితే అసలు క‌థ‌లోకి వెళ్లిపోదాం ప‌దండి. ముంబైకి చెందిన ఓ సీనియ‌ర్ న్యాయ‌వాది మొద‌టి భార్య క‌న్నుమూశారు. దీనితో ఆయ‌న 2015 ఏప్రిల్ 21న ఓ బాలిక‌ను పెళ్లాడారు. పెళ్లి చేసుకునే స‌మ‌యానికి ఆ బాలిక వ‌య‌స్సు 14 ఏళ్ల 7 నెల‌లు మాత్ర‌మే. రెండేళ్ల పాటు వారి కాపురం స‌జావుగా సాగింది. 2017లో వారి మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయి. గృహహింస వేధింపులు అధికమ‌య్యాయి. దీనితో ఆ బాలిక త‌న భ‌ర్త‌పై ముంబైలోని కాలాచౌకీ పోలిస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఆయ‌న‌పై బాల్య వివాహాల నిరోధ‌క చ‌ట్టం-2006 కింద కేసు న‌మోదు చేశారు. క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. 10 నెల‌ల పాటు ఆ న్యాయ‌వాది పోలీసుల క‌స్ట‌డీలోనే ఉన్నారు.

అనంత‌రం.. ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మార‌డంతో ఆ బాలిక త‌న భ‌ర్త‌ - ఆయ‌న కుటుంబీకుల‌తో రాజీ ప‌డ్డారు. కేసును ఉప‌సంహ‌ర‌ణ‌కు స‌మ్మ‌తించారు. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. త‌న‌కు భ‌ర్త తోడు కావాల‌ని కోరుతూ మ‌రోసారి ఆమె న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. తాను కేసును ఉప‌సంహ‌రించుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని, త‌న భ‌ర్త‌తో క‌లిసి నివసించ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ఆ బాలిక బాంబే హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. జ‌స్టిస్ రంజిత్ మోరె, జ‌స్టిస్ భార‌తి డాంగ్రేల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్‌.. ఈ పిటీషన్‌ పై విచార‌ణ చేప‌ట్టింది. చాలాకాలం పాటు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది ఈ కేసు. చివ‌రికి ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఆ బాలిక ఓ అఫిడ‌విట్‌ను కూడా దాఖ‌లు చేశారు. తాను భ‌ర్త‌తో ఇష్ట‌పూర‌కంగా క‌లిసి నివ‌సిస్తాన‌ని, ఇందులో ఎవ‌రి బ‌ల‌వంతం లేద‌ని, ఎవ‌రి ప్రోద్బ‌లం లేదని అంటూ ఆమె ఈ అఫిడ‌విట్‌లో పొందు ప‌రిచారు. బాంబే హైకోర్టులో ఈ కేసు ప‌లు వాయిదాలు ప‌డింది. సుదీర్ఘ కాలం పాటు విచార‌ణ కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలో- ఆమె మ‌రో పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. తాను మేజ‌ర్ అయ్యాన‌ని, స్వ‌తంత్రంగా నిర్ణ‌యాల‌ను తీసుకోగ‌లుగుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న భ‌ర్త‌తో క‌లిసి జీవించ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని, కేసును త్వ‌రిత‌గ‌తిన ముగించాల‌ని తాజా పిటీష‌న్‌లో విజ్ఞ‌ప్తి చేశారు.

దీన్ని కూడా స్వీక‌రించిన డివిజ‌న్ బెంచ్‌.. రెండు పిటీష‌న్ల‌ను క‌లిపి విచారించింది.ఈ లోగా ఆ బాలిక మేజ‌ర్ అయ్యారు. 18 ఏళ్ల‌56 సంవత్స‌రాల భ‌ర్త‌తో క‌లిసి జీవించ‌డానికి భార్య మ‌న‌స్ఫూర్తిగా ఇష్ట‌ప‌డుతున్నందున‌.. ఈ వివాహానికి స‌మ్మ‌తిస్తున్నామ‌ని, చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను క‌ల్పిస్తున్నామ‌ని సోమ‌వారం తుది తీర్పును వెలువ‌రించింది. ఈ విష‌యంలో తాము మాన‌వ‌తాదృక్ప‌థాన్ని, వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని న్యాయ‌మూర్తులు చెప్పారు. భార్య‌భ‌ర్త‌ను విడ‌దీయ‌డం వ‌ల్ల ఆమెపై ఒంట‌రి మ‌హిళ అనే ముద్ర ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. రెండో పెళ్లి చేసుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌చ్చ‌ని, ఈ పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అత్యంత ముఖ్యమ‌ని భావించ‌డం వ‌ల్లే ఈ పెళ్లికి స‌మ్మ‌తిస్తున్నామ‌ని న్యాయ‌మూర్తులు తెలిపారు.

   

Tags:    

Similar News