గడచిన సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ మంత్రంతో బీజేపీ అదరగొట్టిందనే చెప్పాలి. ఎన్డీఏ పేరిటే బరిలోకి దిగినా... కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత స్థానాలను బీజేపీ ఒక్కదానికే దక్కేశాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఏమాత్రం అవసరం లేకుండానే మెజారిటీ సాదించిన బీజేపీ... మిత్రధర్మానికి కట్టుబడి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది జరిగి ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇటీవల గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల దాకా మోదీ హవా బాగానే ఉన్నా... ఆ ఎన్నికల తర్వాత బీజేపీ విజయం సాధించినా... మోదీ ప్రభ మాత్రం క్రమక్రమంగా తగ్గిపోతోందనే భావన వినిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రాహుల్ గాంధీ కూడా తనదైన శైలిలో సత్తా చాటుతూ 2019 ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తంగా బీజేపీ ప్రభ తగ్గిపోతుండగా - కాంగ్రెస్ అంతే స్థాయిలో కాకపోయినా... కొద్దో గొప్పో గ్రోత్ ను మాత్రం నమోదు చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధానిగా గెలవాలంటే కేవలం ఉత్తరాదిలో మాత్రమే బలం ఉంటే సరిపోదని - దక్షిణాది రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో బలం అవసరమన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో కన్నడ నాట బాగానే ఉన్న ఆ పార్టీ... తమిళనాట మాత్రం తన పప్పులు ఉడకవని తెలుసుకుంది. ఇప్పుడు ప్రత్యేకించి రెండు రాష్ట్రాలున్న తెలుగు నేలపై కమలనాథులు ప్రత్యేక దృష్టినే పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ విషయాన్ని కాస్తంత పక్కనపెడితే... ఏపీలో టీడీపీతో జట్టుకట్టి గడచిన ఎన్నికలకు వెళ్లిన బీజేపీ రెండు ఎంపీ సీట్లతో పాటు నాలుగు అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయం ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్న తీరు మొన్నటి కేంద్ర బడ్జెట్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ మాటలు ఏ స్థాయికి వెళ్లాయంటే... వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కల్లేనన్న భావన వచ్చేదాకా అని చెప్పక తప్పదు. బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరుగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడినే టార్గెట్ చేసుకుని తన నోటికి పనిచెబుతున్న వీర్రాజు టీడీపీ నేతల సహనాన్ని పరీక్షిస్తున్నారనే చెప్పాలి.
అసలు ఏపీకి కేంద్రం ఏం అన్యాయం చేసిందని టీడీపీ సర్కారును సూటిగానే ప్రశ్నిస్తున్న వీర్రాజు... ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు... వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మొత్తంగా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని చెప్పిన బొండా.. ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎప్పుడు ఎదగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం వాళ్ల అత్యాశేనని ఆయన వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్ గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని బొండా గుర్తు చేశారు.
ఏపీకి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని చెబుతున్నారని, 2016లో అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి అన్న రాష్ట్రానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిని జిల్లాలకు బుదేల్ ఖండ్ - కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామన్నారని అవన్నీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రూ.24వేల కోట్లకుగానూ కేంద్రం కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర రాజధానికి రైతులు రూ.50వేల కోట్లు విలువ చేసే భూమి ఇస్తే బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందని ఆయన అన్నారు. వాటితో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ...టీడీపీని మోసం చేసిందని అయిదు కోట్ల ప్రజలు అంటున్నారని, వారికి వీర్రాజు సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. మొత్తంగా ఏపీలో ఎదుగుతామని బీజేపీ కలలు కంటోందని, అది అంత వీజీ ఏమీ కాదని - అసలు ఏపీలో బీజేపీ ఎదుగుదల అనేది భ్రమేనని ఆయన తేల్చేశారు.