తెలుగుదేశం పార్టీలో మాటల దూకుడు ఎక్కువగా ఉన్నట్లు కనిపించే ఎమ్మెల్యేల్లో బొండా ఉమామహేశ్వరరావు ఒకరు. ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల దూకుడుకు తమదైన తీరుతో వారి స్థాయిలో విరుచుకుపడే నేతగా బొండాకు పేరుంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి.. అసెంబ్లీలో అయ్యగారి ఆగ్రహం చూసిన తర్వాత తెలుగు ప్రజలకు బొండా సరికొత్తగా పరిచయం అయ్యారని చెప్పాలి. ఎమ్మెల్యే కాకముందు పరిమితంగా ఉన్న ఆయన ఇమేజ్ తర్వాతి కాలంలో ఆయన మాటలకు.. చేష్టలకు పలువురు ఫ్యాన్స్ అయిన పరిస్థితి. అదే సమయంలో ఆయనపై తీవ్రంగా మండిపడే వారూ ఉన్నారు.
మొన్న తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభ అనంతరం ఏపీ అధికారపక్ష నేతలు పలువురు పవన్ పై విరుచుకుపడితే.. బొండా మాత్రం అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించారు. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా బెజవాడలో ఆయన ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలంగా మారాయి. ఏపీ అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరించిన జనసేనకు భిన్నంగా బొండా తయారు చేయించిన ఫ్లెక్సీలు ఉండటం గమనార్హం.
పవన్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ ఫోటో తప్ప.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జెండా.. పార్టీ గుర్తు కానీ లేకుండా ఉండటమే కాదు చివరకు పార్టీ అధినేత చంద్రబాబు ఫోటో కూడా లేకపోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధినేత ఫోటోను సైతం విస్మరించేలా పవన్ మీద బొండా అభిమానం పెరిగిందా? అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ఏదీ పవన్ ఫ్లెక్సీల మీద లేనప్పటికీ తన ఫోటోను మాత్రం బొండా వేసుకోవటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులపై దూకుడు తప్పు లేదు కానీ.. స్వపక్షాన్ని చిన్నబుచ్చేలా బొండా ఫ్లెక్సీలు ఉన్నాయని.. ఈ విషయంలో బొండాకు తలంటు గ్యారెంటీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ్ముళ్లు భావించినట్లుగా బాబు ఈ ఫ్లెక్సీల్ని పట్టించుకుంటారా? లేరా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.