సిల్వర్ సింధుకు ఏపీ సర్కారు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆసక్తికర సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అత్యంత ఉల్లాసభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింధుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు షటిల్ ఆడటం ఒక హైలెట్ అయితే.. మరొకటి విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హడావుడి. తనదైన వ్యాఖ్యలతో దూకుడుగా వ్యవహరించే బొండా ఉమా మైకు పట్టుకొని.. సింధు పుట్టుపూర్వోత్తరాలతో పాటు.. ఆమె కోచ్ గోపీ.. ఆయన సతీమణికి సంబంధించిన వివరాలు మొత్తాన్ని వెల్లడించటం గమనార్హం.
సింధు తాతగారిది విజయవాడ అని.. సింధు తండ్రిది ఏలూరని.. తల్లిది విజయవాడగా బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అక్కడితో ఆగని ఆయన సింధు కోచ్ గోపీ చంద్ ది ప్రకాశం జిల్లా అని.. ఆయన సతీమణిది విజయవాడగా చెప్పుకొచ్చారు. సింధును తెలంగాణ బిడ్డగా తెలంగాణ అధికారపక్ష నేతలు పలువురు చెబుతున్న వేళ.. బొండా ఉమ నోటి నుంచి ‘మన అమ్మాయి.. మన విజయవాడ అమ్మాయి’ లాంటి వ్యాఖ్యలు తరచూ చెప్పటం కనిపించింది.
మొత్తానికి సింధుతో పాటు.. ఆమె తల్లిదండ్రులు.. సింధు కోచ్ గోపీచంద్.. ఆయన సతీమణిది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారన్న విషయాన్ని బల్లగుద్ది చెప్పినట్లుగా పదే పదే బొండా ఉమామహేశ్వరరావు ప్రకటించటం చెప్పిన తీరుచూస్తే.. బొండా ఏం చెప్పాలనుకున్నారన్న విషయం అర్థం కావటమే కాదు.. బొండా సామాన్యుడు కాదన్న అభిప్రాయం కలగటం ఖాయం.