కోగంటి నువ్వు రౌడీవి.. బోండా నువ్వే రౌడీవి..

Update: 2016-09-03 07:25 GMT
ఒక‌రు ఇండ‌స్ట్రియ‌లిస్ట్‌ - ఒక‌రు ప్ర‌జాప్ర‌తినిధి! అయితేనేం.. ప‌ల్లెటూళ్ల‌లో పంపుల ద‌గ్గ‌ర ఆడోళ్లు తిట్టుకున్న‌ట్టు తిట్టేసుకున్నారు. అది కూడా టీవీ లైవ్ షోలోనే! ఇంకేముంది.. చూడు నా రాజా అంటూ ఆడియ‌న్స్ ఎంజాయ్ చేసేశారు. మేట‌ర్‌ లోకి వ‌చ్చేస్తే.. ఏపీ రాజ‌ధాని ప్రాంతం బెజ‌వాడ‌లో ఎప్ప‌టి నుంచో పాతుకుపోయిన ఇండ‌స్ట్రియ‌లిస్ట్ కోగంటి స‌త్యం - ఇటీవ‌ల కాలంలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌ గా త‌యార‌వుతున్న సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు కూల్ వాట‌ర్ పోసినా.. హాట్ పెట్రోల్ లాగా మండిపోతోంది. ఈ ఏడాది గ‌ణేష్ ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఇది కోగంటి స‌త్యం ఆధ్వ‌ర్యంలో సాగుతోంది. దీనికి ఉమా కూడా స‌హ‌క‌రిస్తున్నారు. భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. హైద‌రాబాద్‌ లోని ఖైర‌తాబాద్ వినాయ‌కుడి టైపులో ఓ రేంజ్‌ లో ఉత్స‌వాలు చేద్దామ‌నుకున్నారు. ఇంత‌లో చందాల విష‌యంలో స‌త్యం - బోండాల మ‌ధ్య వివాదం ర‌గులుకుంది. చినికి చినికి గాలివానై.. ఇద్ద‌రూ చీపుగా తిట్టుకునే స్థాయికి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలోనే ఓ టీవీ ఛానెల్ వాళ్లు ఇద్ద‌రినీ కూర్చోబెట్టి లైవ్ డిబేట్ చేప‌ట్టారు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన డిబేట్‌ లో ఇద్ద‌రూ నేరుగా ఒక‌రి గురించి ఒక‌రు పంచాంగం విప్పేసుకున్నారు. నువ్వు రౌడీవి అంటే.. నువ్వే రౌడీవి అంటూ తెగ తిట్టి పోసుకున్నారు.  ఇలా ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఇంట‌ర‌స్టింగ్ డిబేట్ ఏంటో మీరూ చూడండి!

బోండా ఉమ: నువ్వు (కోగంటి సత్యం) ఎన్నిసార్లు జైలు కెళ్లావో చెప్పాలి

కోగంటి సత్యం: నీ మీదున్న రౌడీ షీట్ ను అప్పటి సీఐ రామారావు కాళ్లు పట్టుకుని నువ్వు తీయించుకున్నావు. నేను అతని కాళ్లు పట్టుకోలేదు. దీంతో నా పైన కేసుంది, లేకపోతే కేసు ఉండేది కాదు.

ఉమ: నువ్వు రౌడీవని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి... నీపై మర్డర్ కేసులున్నాయి

సత్యం: నువ్వు రాజకీయ రౌడీవి... నన్ను రౌడీ అంటావా? నా పేరు చెప్పుకుని నువ్వు ఎన్నో సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకున్నావు. నేను షోడాలు అమ్ముకుని జీవితంలో పైకి వచ్చాను... నువ్వు నాలాంటోళ్ల దగ్గర పని చేసి ఎదిగావు.

ఉమ: నేను 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాను

సత్యం: అది నీ గొప్పతనం కాదు... చంద్రబాబు వల్ల నీకు లభించింది.  నీ పదవికి రాజీనామా చేసిరా... ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం... ఎవ‌రి స‌త్తా ఏంటో తెలిసిపోద్ది.
Tags:    

Similar News