తమ ప్రభుత్వాన్ని గంటలోపు కూల్చేస్తానని జగన్ అన్నందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుగు దేశం నాయకులు చెప్పడంపై వైఎస్సార్ కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. తాను అన్న వ్యాఖ్యలు వేరని.. దాన్ని వక్రీకరించారని జగన్ అంటుంటే.. నిజంగా ఆ రోజు జగన్ చేసిన వ్యాఖ్యలేంటో యథాతథంగా ప్రచురించింది సాక్షి పత్రిక. మరోవైపు వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చారు. గంటలో ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ అన్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.
ఈ వ్యవహారంలో కొందరు కావాలనే జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ అసలు అననే లేదని ఆయన చెప్పారు. కొందరు స్వార్దంతో, సొంత ఎజెండాతో తమ పార్టీని వదిలి వెళ్తే దానికి అభివృద్ధి ముసుగు వేస్తున్నారని ఆయన అన్నారు. నిజంగానే తెదేపా సర్కారు అభివృద్ది చేస్తున్నట్లయితే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన సవాల్ చేశారు. అభివృద్ది పేరుతో జరుగుతున్నదంతా దోపిడీయేనని ఆయనన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ప్రజలంతా మారతారని అనుకోవడం భ్రమ అని.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా నేరుగా కాంగ్రెస్ కండువా కప్పలేదని ఆయన అన్నారు. దానం నాగేందర్ టీడీపీ నుంచి వస్తే రాజీనామా చేయించి.. ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ లోకి తీసుకున్నారన్నారు.