ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏలో తాను కీలక భాగస్వామిని అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు ఆ దోస్తీని ప్రజా సంక్షేమం కోసం ఎందుకు ఉపయోగించడం లేదని అన్నారు. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు చంద్రబాబు స్వప్రయోజనాల కోసమా? రాష్ట్ర ప్రయోజనాల కోసమా? అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్సా సత్యానారయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువొచ్చినా రైతాంగాన్ని ఆదుకున్న పాపాన పోలేదన్నారు.
ఎన్డీయేలో భాగస్వామిగా తెలుగుదేశం ఉన్నందు వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమిటని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజ్యసభలో చర్చ జరుగుతున్నా, ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంలో ఆంతర్యమేమిటని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎంపీలు నోట్లకు ప్లాస్టర్లు వేసుకున్నారా అని బొత్స ఎద్దేవా చేశారు. వాస్తవాలను ప్రజలకు ఎందుకు చెప్పటం లేదని టీడీపీని బొత్స నిలదీశారు. అసలు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎటు చూసినా కరువు కాటకాలు, పేపర్ లీక్స్, అవినీతే కనబడుతోందన్నారు. విద్యార్థులు తక్కువ ఉంటే స్కూల్స్ మూసేస్తామని ప్రభుత్వం ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా నిర్భంద విద్య అమలు చేస్తుంటే ఏపీలో స్కూల్స్ మూసివేత దిశగా వెళ్తోందన్నారు. దేశమంతా ఒకదారి అయితే...ఏపీ సీఎం చంద్రబాబుది మరోదారి అని బొత్సా ఎద్దేవా చేశారు.
కేంద్రం నుంచి ఈ మూడేళ్లలో ఈ రాష్ట్రానికి ఏవిధమైన మేలు జరగలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు హామీయిచ్చి, విస్మరించారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు రాష్ట్రానికి ఒరిగిందేమిటని బొత్స నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/