ఏపీలో జరుగుతున్న అవినీతి - భూకబ్జాలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా రియాక్టయ్యారు. తెలుగుదేశం పార్టీ భూదందాలనే ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రము లోని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు మాఫియా ప్రభుత్వం అని మండిపడ్డారు. ఏ అంశం చూసిన మాఫీయానే కనపడుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరు ప్రశ్నించిన టీడీపీకి చీమ కుట్టినట్లయిన లేదని, ఆ పార్టీ లో ఎమ్మెల్యే ఎంపీలు కూడా అదే విషయాన్ని చెబుతున్నారని బొత్స అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ జిల్లాల్లో పేదల భూమి పైన కన్ను వేశారని, ఈ విషయంలో గత ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీగా భూ కుంభకోణాలపై వైఎస్ ఆర్ సీపీ గోషిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కంటితుడుపు చర్యగా మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించి, భూకబ్జాలపై సిట్ ఏర్పాటు చేశాం అని ప్రకటించారని బొత్స తెలిపారు. రెవెన్యూమంత్రి మీడియా ముందుకు వచ్చి కొమ్మాది - మధురవాడ ప్రాంతాల్లో 300 ఎకరాల రికార్డులు తారుమారయ్యాయి. వాటి మీద విచారణ చేస్తాం.. ఇంకేదైనా ఉంటే అది కూడా చేస్తాం అన్నట్లుగా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడారని బొత్స ఆరోపించారు. హుద్ హుద్ తుఫాన్ లో రికార్డులు మాయమయ్యాయన్న జిల్లాకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం - మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు సిట్ లో ఉన్నారు కాబట్టి భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగదని బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ చుట్టుపక్కల మండలాలు మధురవాడ - అనకాపల్లి - పద్మనాభం - అనందపురం - బీమిలీ - అనకాలపల్లి రూరల్ ల్లో వేలాది ఎకరాలు ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చంద్రబాబును ప్రశ్నించారు.
233 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో ట్యాంపరింగ్ జరిగిందని, 2 లక్షల 95 వేల ఎఫ్ ఎంబీ కాపీలు కనిపించకుండా పోయాయయని జిల్లా కలెక్టర్ చెప్పిన మాట వాస్తవం కాదా అని బొత్స నిలదీశారు. అనుభవం ఉందని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారా..? ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టుకొని తినేస్తారా...? అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై బొత్స విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ భూదందాలనే ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా.. అధికారం ఉంటే.. భుజబలం ఉంటే ఎదుటివాడు పేదవాడు అయితే అది ప్రభుత్వ భూమి అయినా కబ్జా చేసుకోవడమే అనే లక్ష్యంతో చంద్రబాబు పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ భూముల కుంభకోణాలు చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా ఏరకంగా పెచ్చుమీరుతుందో.. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలన్నారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను లూటీ చేయడాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవినీతిని తీవ్రంగా ఎండగడతామని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/