ఆ చానెళ్ల‌ను బాయ్ కాట్ చేయండి: ప‌వ‌న్

Update: 2018-04-20 14:47 GMT
త‌న‌పై కొన్ని మీడియా చానెళ్లు కుట్ర‌ప‌న్నాయ‌ని, వాటి పేర్లు ప్ర‌స్తావిస్తూ జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాన్ ఈ రోజు ఉద‌యం వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను టార్గెట్ చేసేందుకు కొన్ని మీడియా చానెళ్లు కుట్ర ప‌న్నాయ‌ని, కొంత‌మంది పేర్ల‌ను కూడా ప్ర‌స్తావిస్తూ ప‌వ‌న్ చేసిన ట్వీట్లు పెను దుమారం రేపాయి. శ్రీ‌నిరాజు ఆ కుట్ర‌లో భాగ‌స్వామి అని, ఆయ‌న తాజా ఫొటో ఇలా ఉంటుంద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఫిల్మ్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు ప‌వ‌న్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు...ఓ ప్ర‌ముఖ న్యూస్ చానెల్ వాహ‌నాన్ని కూడా ధ్వంసం చేశాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ తాజాగా, త‌న అభిమానుల‌నుద్దేశించి మ‌రి కొన్ని ట్వీట్స్ చేశారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులంతా సహనం వహించాలని ప‌వ‌న్  పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి అభిమానులు, కార్య‌క‌ర్త‌లంద‌రూ సంయమనంతో వ్యవహరించాలని, హింసకు పాల్పడవద్దని ప‌వ‌న్ మ‌రోసారి పిలుపునిచ్చారు.

తనపై, త‌న తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై...అందుకు ప్రేరేపించిన మీడియా చానెళ్ల‌పై పవన్ వరుస ట్వీట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం వెనుక కొన్ని చానెళ్ల‌తోపాటు శ్రీని రాజు, మంత్రి లోకేశ్, రాంగోపాల్ వర్మ ఉన్నారని ఆరోపించారు. ఆ ట్వీట్ల‌పై స్పందించిన శ్రీని రాజు.. పవన్ పై పరువునష్టం దావా వేయబోతున్నార‌ని తెలుస్తోంది. దీంతో, పవన్ తన అభిమానులు సంయ‌మ‌నం కోల్పోవ‌ద్ద‌ని తాజాగా ట్వీట్లు పెట్టిన‌ట్లు అనిపిస్తోంది. త‌న‌పై ఆయ‌న పరువు నష్టం దావా వేయ‌బోతున్నారని, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ అన్నారు. కొంత‌మంది మీడియా చానళ్ల  ముఖ్యుల‌పై తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయ‌బోతున్నాన‌ని చెప్పారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు...ఎటువంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా, మన తల్లీ చెల్లెళ్లను, కుమార్తెలను రేటింగుల కోసం అసభ్యంగా చూపిస్తున్న కొన్ని మీడియా చానెళ్ల‌ను బహిష్కరించాలని జన సైనికులకు పవన్ పిలుపు నిచ్చారు. అంతేకాకుండా, ఒక నిస్స‌హాయురాలైన చెల్లెలిపై వ్యాపారం చేయాల‌ని.... న‌గ్నత్వం వంటి వాటిని చూపించి వ్యాపారం చేయాల‌ని భావిస్తోన్న ఆ చానెళ్ల‌ను బ‌హిష్క‌రించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

Click Here For Video : https://www.youtube.com/watch?v=gYh5wkFXB1A&feature=youtu.be
Tags:    

Similar News