ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సొంత కుంపట్లు మొదలవుతున్నాయి. తమను ఓబీసీల జాబితాలో చేర్చాలంటూ ఇప్పటికే పటేళ్లు ఉద్యమిస్తుండగా... మరిన్ని వర్గాల నుంచి రిజర్వేషన్ల డిమాండ్ లు ఊపందుకుంటున్నాయి. తాజాగా తమకూ రిజర్వేషన్ లు కల్పించాలని గుజరాత్ కు చెందిన బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. విద్య - ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ లు కేటాయించాలని ఆ రాష్ర్టానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో పాటు ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్నవారికి నెలవారీ వేతనాలు చెల్లించాలని ఆల్ గుజరాత్ బ్రహ్మ సమాజ్ డిమాండ్ చేసింది.
బిహార్ ఎన్నికల్లో దళిత - బహుజన వర్గాల ఓట్లతో పాటు అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణుల ఓట్లు కూడా కీలక స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ రాష్ర్టంలోని డిమాండ్ బిహారీల బ్రహ్మణులకు చేరితే అక్కడ కూడా మోడీపై అసంతృప్తి ప్రారంభం కావచ్చునని భావిస్తున్నారు. దీంతో పాటు సొంత రాష్ర్టంలోని ప్రజల న్యాయపరమైన డిమాండ్ లను పరిష్కరించలేని వ్యక్తి అనే అభిప్రాయం కూడా మోడీ పై పడొచ్చని సమాచారం. వీటన్నింటికంటే ముఖ్యంగా బీజేపీకి బ్రాహ్మణులు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. దీంతో బ్రాహ్మణుల ఆందోళన బిహార్ ఎన్నికలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుదని భావిస్తున్నారు.