కీలకమైన బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నాడన్న ఆరోపణపై అరెస్టయిన డీఆర్ డీఓ ఇంజినీర్ నిశాంగ్ అగర్వాల్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ నిఘా సంస్థలు ఇద్దరు మహిళల ద్వారా నిశాంత్ కు లైంగిక వల (హనీట్రాప్) వేసినట్టు తేలిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నేహా శర్మ - పూజా రంజన్ పేరిట ఉన్న ఫేస్ బుక్ ఖాతాలతో నిశాంత్ సంభాషణలు సాగించినట్టు పోలీసులు గుర్తించారు. బ్రహ్మోస్‌కు అణ్వాయుధాన్ని అమర్చే విభాగంలో అధిపతిగా పనిచేసిన నిశాంత్ కు ఇటీవలే యువ శాస్త్రవేత్త అవార్డు కూడా లభించింది. అలాంటి వ్యక్తి ఈ దుర్మార్గపు పనికి పాల్పడటమే సంచలనం అనుకుంటే..ఆయన దేశభద్రతను పణంగా పెట్టింది ఒక ఉద్యోగం కోసమని తేలింది.
నాగపూర్ లోని బ్రహ్మోస్ సెంటర్ లో యూపీ - మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. యూపీ ఏటీఎస్ పోలీసులు నిషాంత్ అగర్వాల్ ను విచారణ చేయగా ఆయన దగ్గరి నుంచి కలకలం రేపే విషయాలు తెరమీదకు వచ్చాయి. కెనడాలో ఓ ఐటీ జాబ్ కోసం అతను .. బ్రహ్మోస్ టెక్నికల్ సీక్రెట్స్ ఇచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 17 లక్షల ఉద్యోగం కోసం అతను క్షిపణి రహస్యాలను బయటపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కెనడాలో ఐటీ జాబ్ కోసం నిషాంత్ దరఖాస్తున్న పెట్టుకున్నాడు - అయితే తన ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ శ్యాంపిల్ కావాలని డిమాండ్ రావడంతో అతను బ్రహ్మోస్ సీక్రెట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ సోనిక్ మిస్సైల్ ప్రాజెక్టుకు సంబధించిన కీలక సమాచారాన్ని అతను శత్రువులకు చేరవేశాడు. అతని పర్సనల్ కంప్యూటర్ లో అత్యంత సున్నితమైన సమాచారం ఉందని - ఫేస్ బుక్ ద్వారా అతను పాక్ ఆపరేటర్లతో చాటింగ్ చేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
ఇస్లామాబాద్ ఐపీ అడ్రస్ తో ఉన్న ఈ రెండు ఖాతాలను పాక్ నిఘా సంస్థకు చెందినవిగా భావిస్తున్నారు. అగర్వాల్ ల్యాప్ టాప్ లో బ్రహ్మోస్‌కు చెందిన కీలక సమాచారం ఉన్నట్టు గుర్తించారు. ఆ సమాచారం అతని కంప్యూటర్ లో ఎందుకున్నదో ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారి చెప్పారు. అయితే నిశాంత్ ఇప్పటికే ఒక గేమింగ్ కోడ్ రూపంలో కొంత సమాచారాన్ని శత్రువులకు చేరవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.