బయటపడుతున్న మారుతీరావు ఆస్తులు...ఎన్ని కొట్లో తెలుసా ?

Update: 2020-03-10 12:30 GMT
మిర్యాలగూడ రియల్ స్టేట్ వ్యాపారి... అమృత తండ్రి మారుతీ రావు ఆస్తి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మారుతీరావుకు ఉన్న స్థిర, చర ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.200 కోట్లుగా లెక్కెతేలింది. మారుతీరావు ఆస్తుల వివరాలను మంగళవారం పోలీపులు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌ లో ఆర్యవైశ్య భవన్‌ లో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున మిర్యాలగూడ లో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా.. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు పడ్డాయి.

బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం.. మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లు ఉంటాయని వెల్లడించారు.
మొదట కిరోసిన్ డీలర్ గా మొదలైన మారుతీరావు ప్రస్థానం...క్రమంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ వరకు సాగింది. ముందుగా కిరోసిన్ డీలర్ గా ఉన్న మారుతీరావు...తర్వాత రైస్‌ మిల్లుల బిజినెస్ చేశాడు. అక్కడ మంచి లాభాలు రావడం తో...వాటిని అమ్మి రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగారు. ఇక మిర్యాలగూడ లో కూతురు అమృత పేరిటా 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఆయన భార్య గిరిజా పేరు మీద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

ఇవే కాకుండా...మారుతీరావు పేరుపై మిర్యాలగూడ బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడ లో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి.. సర్వే నెం.457 లో 7 కుంటల భూమి, దామరచర్లలో 20 ఎకరాల పట్టా లాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్‌, బంగారు గడ్డలో ప్లాట్స్.. మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.
Tags:    

Similar News