బ్రేకింగ్ః రేప‌టి నుంచి ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ!

Update: 2021-04-23 12:20 GMT
దేశంలో క‌రోనా క‌రాళనృత్యం చేస్తోంది. ఆ విజృంభ‌ణ‌కు రాష్ట్రాల‌న్నీ అత‌లాకుత‌ల‌మైపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 ల‌క్ష‌ల 30 వేల‌కుపైగా కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. సుమారు 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇటు వైర‌స్ సోకిన వారితో ఆసుప‌త్రుల‌న్నీ నిండిపోతున్నాయి. ప‌డ‌క‌లు ల‌భించ‌క రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంకా ఆక్సీజ‌న్ కావాల్సినంత అందుబాటులో లేక‌పోవ‌డంతో నానా అవ‌స్థలు ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నం భ‌యం గుప్ప‌టి జీవిస్తున్నారు.

ఈ ప‌రిస్థితి మ‌రింత‌గా విష‌మించ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులో భాగంగా రాత్రిపూట క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఈ రూల్స్ అమ‌ల్లో ఉంటాయి.

వైద్య‌స‌హాయం వంటి అత్య‌వ‌స‌రాల్లో ఉన్న‌వారు త‌ప్ప‌, మిగిలిన వారెవ్వ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. వ్యాపార స‌ముదాయాలు ఏవి కూడా తెరిచి ఉండ‌డానికి వీళ్లేద‌ని తెలిపింది. ఇక‌, ప్ర‌జ‌లు మాస్కు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని సూచించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.
Tags:    

Similar News