అనుకున్నట్టేగా సాగర్ గులాబీ సొంతమైంది. కేసీఆర్ స్కెచ్ గీశాక కురువృద్ధుడైన జానారెడ్డి కూడా నిలవలేకపోయారు. 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన జానారెడ్డిని ఆయన కంచుకోటలో ఓడగొట్టి టీఆర్ఎస్ కుర్ర అభ్యర్థి నోముల భగత్ సంచలనం సృష్టించారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతు అయింది.