దేశంలోని కీలక రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమంతిచడంపై సీపీఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశానికి ప్రమాదకరమని - రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని ఫైరయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎఫ్ డిఐలను వ్యతిరేకించి అధికారంలోకి రాగానే స్వాగతించడం బీజేపీ ద్వంద్వవైఖరికి నిదర్శనమని విమర్శించారు. పార్లమెంట్ వ్యవస్థను తోసిరాజనని ఈ-కామర్స్ తో సహా అన్ని రంగాల్లోకి వంద శాతం ఎఫ్ డిఐలను అనుమతిస్తూ కేంద్ర సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆమె ధ్వజమెత్తారు. రక్షణ - రిటైల్ ఆహార వాణిజ్యం - సివిల్ ఏవియేషన్ - కేబుల్ నెట్ వర్క్ తదితర రంగాల్లో వంద శాతం ఎఫ్ డిఐలను స్వాగతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ఆమె ప్రసంగించారు.
'మరో నెలలో వర్షాకాల శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కానీ పార్లమెంట్ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా కీలక రంగాల్లోకి వంద శాతం ఎఫ్ డిఐలను అనుమతిస్తూ మోడీ సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఎఫ్ డిఐలపై నిర్ణయంతో మోడీ గత నియంత్రృత్వ చరిత్ర మరోసారి బయటపడింది. యూపీఏ హయాంలోనూ నాటి మన్మోహన్ సర్కారు ఎఫ్ డిఐలను అనుమతించే ప్రయత్నం చేసింది. కానీ ప్రజా పోరాటాలతో తిప్పికొట్టాం' అని బృందా వివరించారు. రక్షణ రంగంలో విదేశీ కంపెనీలు చొరబడితే దేశీయ ఆయుధ కంపెనీలు మూతపడతాయని వివరించారు. అలాగే కార్మికుల హక్కులపై తీవ్రంగా దాడి జరగుతుందని తెలిపారు. ఇక బీజేపీ దేశభక్తిపై ఆమె విమర్శలు చేశారు. 'బీజేపీది దేశభక్తి కాదు. అసత్యపు - దొంగ దేశభక్తి అని ఎఫ్ డిఐలపై తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది' అని చెప్పారు. 'దేశవ్యాప్తంగా గోమాత రక్షణ పేరుతో హత్యలు చేశారు. ఇదే వీళ్ల దేశభక్తి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు మేక్ ఇన్ ఇండియా అంటూ 'బ్రేక్ ఇన్ ఇండియా' విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.
రక్షణ రంగంలోకి ఎఫ్ డీఐలను స్వాగతిస్తే.. విదేశీ కంపెనీలు దేశానికి అవసరమైన ఆయుధాలు తయారు చేస్తాయా అని బృందా ప్రశ్నించారు. 'ఇటీవల వెలువడిన అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఉగ్రవాద సంస్థయినటువంటి ఐఎస్ ఐఎస్ కు వివిధ దేశాల్లోని 28 కంపెనీలు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. అందులో మనం దేశం నుంచి ఎనిమిది ప్రయివేటు రంగ కంపెనీలు ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ప్రధాని మోడీకి తెలీకుండానే ఈ కంపెనీలు ఉగ్రవాదులకు ఆయుధాలు విక్రయిస్తున్నాయా?. రక్షణ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే ఇలాంటి చెడు పరిణామాలు చోటుచేసుకుంటాయి' అని వివరించారు.