ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బాబుకు డబ్బుపై తప్ప మనుషులపై ప్రేమ లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజమండ్రిలో నిర్వాసితులతో కలిసి సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన బృందా ఈ సందర్భంగా ఏపీ సీఎం తీరును తప్పుపట్టారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టుపై ముందుకు సాగాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 12 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నాలుగు గ్రామాలకు కూడా పునరావాసం కల్పించలేదని మర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 2 లక్షల మంది నిర్వాసితులు అవుతారని బృందా కరత్ గుర్తుచేశారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని ముందుకు సాగుతున్న ఏపీ సీఎం తీరు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబుకు డబ్బుపైన ఉన్న ప్రేమ గిరిజనులపై లేదని స్పష్టం అవుతోందని బృందా కరత్ మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ముందుకు వెళ్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/