ఆస్ట్రాజెనికా అత్యవసర వినియోగానికి బ్రిటన్​ అనుమతి..

Update: 2021-01-04 12:53 GMT
ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు బ్రిటన్​లో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కరోనా మహమ్మారి బ్రిటన్​ను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పటికే అక్కడ ఫైజర్​ వ్యాక్సిన్​కు అనుమతి లభించింది. ఫైజర్​ పంపిణీ కూడా ప్రారంభమయింది. అయితే బ్రిటన్​లో ఇటీవల కరోనా కొత్త స్ట్రెయిన్​ వ్యాపించింది. ఇది పాత కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్నది. దీంతో అన్నిదేశాల్లో ఈ కొత్త స్ట్రెయిన్​పై ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో పలు దేశాలు బ్రిటన్​తో రాకపోకలు కూడా నిలిపివేశాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్​లో ఆక్స్​ఫర్డ్​ తీసుకొచ్చిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు అనుమతి లభించింది.

బ్రిటన్​కు చెందిన 82 ఏళ్ల డ‌యాల‌సిస్ పేషెంట్ బ్రియాన్ పింక‌ర్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ను తీసుకున్నారు. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలోని వైద్యసిబ్బంది పింకర్​ టీకా వేశారు. ఈ సందర్భంగా పింకర్​ మాట్లాడుతూ.. తొలిటీకాను తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా కోసం ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ను తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ హాస్పిటల్‌లో చీఫ్ న‌ర్సింగ్ ఆఫీస‌ర్‌గా చేస్తున్న సామ్ ఫోస్టర్ ఆ వృద్ధుడికి టీకా వేశారు. టీకాను అభివృద్ధి చేసిన ప్రాంతానికి కొన్ని వంద‌ల మీట‌ర్ల దూరంలోనే ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రత్యేకంగా భావిస్తున్నట్లు సామ్ ఫోస్టర్ తెలిపారు.


ఆక్స్​ఫర్డ్​ టీకాకు డిసెంబర్​ 30న బ్రిటన్​ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్​ మొదలుపెట్టారు. మరోవైపు మనదేశంలో కూడా ఆక్స్​ఫర్డ్​ టీకాకు అనుమతి లభించింది. ఆక్స్​ఫర్డ్​ టీకాతోపాటు భారత్​బయోటెక్​ తయారు చేసిన కోవాక్జిన్​కు కూడా అనుమతి వచ్చింది. ఇప్పటికే డ్రైరన్​ ప్రారంభించారు. త్వరలోనే వ్యాక్సినేషన్​ ప్రారంభించే అవకాశం ఉన్నది.


Tags:    

Similar News