త్వరలో భారత్ కు నీరవ్ మోదీ?

Update: 2021-04-16 16:30 GMT
భారత్ లోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నీరవ్ మోదీకి ఉచ్చు బిగుసుకుంటోంది. వజ్రాల వ్యాపారిగా ఫేమస్ అయిన ఈ యన భారీగా బ్యాంకుల వద్ద అప్పులు చేసి తీర్చకుండా లండన్ పారిపోయాడు.

ఈ క్రమంలోనే బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి బ్రిటన్ లోనూ కోర్టుల్లో పిటీషన్లు వేశాయి. ఇన్నాళ్లుగా సాగిన విచారణ తర్వాత భారత్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు నీరవ్ మోడీని అప్పగించేందుకు బ్రిటన్ దేశం సిద్ధమైంది.నీరవ్ మోడీ భారత్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మూడేళ్ల నుంచి నీరవ్ మోడీని ఇండియాకు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రాజ్యసభలో సైతం దీనిపై ప్రకటన చేసింది.బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్.. స్కాం వెలుగులోకి వచ్చేలోగా విదేశాలకు పారిపోయాడు. భారత్ కు వస్తే ఆయనపై బ్యాంకులను మోసం చేసిన కేసులో విచారణ జరుగనుంది.
Tags:    

Similar News