నిన్నమొన్నటి వరకు రూ.150కి అటుఇటుగా ఉన్న బ్రాయిలర్ కోడి మాంసం ధర అమాంతం పెరుగుతోంది. వారవారానికి ధరలో పెద్ద తేడా వస్తోంది. సరిగ్గా ఫిబ్రవరి మధ్య నాటికి బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.160. ఈ ఆదివారం అది రూ.290 నుంచి రూ.300 వరకు పలికింది. మార్చిలోనే ఈ స్థాయి ధరలు ఉంటే.. ఎండలు బాగా ముదిరే ఏప్రిల్, మే నెలల్లో ధర రూ.350 కి చేరినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. వాస్తవానికి బ్రాయిలర్ తో పోలిస్తే నాటుకోడి మాంసంలో పోషకాలు చాలా అధికం. రుచి కూడా బాగుంటుంది. అయితే, వంట సరిగా కుదరాలి. దినసులన్నీ పడాలి. వంట కూడా కొద్దిగా శ్రమతో కూడుకుని ఉంటుంది. నాటు కోడి లభ్యత కూడా కాస్త కష్టం. కొన్నేళ్లుగా హైదరాబాద్ వంటి నగరాల్లో నాటుకోడి లభ్యత పెరిగింది. సమీప ప్రాంతాల నుంచి సిటీకి రవాణా సాగుతుండడం, గిరాకీ కూడా ఉంటుండడంతో వ్యాపారాలు బ్రాయిలర్ కోళ్లతో పాటు నాటుకోళ్లనూ అమ్ముతున్నారు.
రెండింటి ధర సమానంగా.
అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.380 వరకు ఉంది. ఇదే సమయంలో బ్రాయిలర్ ధర పెరుగుతూ రూ.300కి సమీపించింది. అంటే.. నాటుకోడికి సై అంటూ బ్రాయిలర్ తొడ గొడుతోంది. కాగా, నాటుకోడి ధర కొన్నాళ్లుగా స్థిరంగా ఉండగా.. బ్రాయిలర్ కోడి మాంసం ధర దానిని అందుకొనేలా కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగిసితే.. ఆసక్తి ఉన్నవారు బ్రాయిలర్ బదులు నాటుకోడి మాంసాన్నే కొనే అవకాశం లేకపోలేదు. ఇది కొనుగోలుదారుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే బ్రాయిలర్ కోళ్ల ధర ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా.
రోజుకు 10 లక్షల కిలో మాంసం విక్రయం
రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని అంచనా. ఆదివారం 15 లక్షల కిలోలకు పైగా ఉంటోంది. కాగా, రెండేళ్ల కిందట కరోనా సమయంలో విక్రయాలు బాగా పెరిగాయి. రోగ నిరోధక శక్తి అందుతుందని ప్రచారం జరగడమే దీనికి కారణం. కోడి మాంసానికి డిమాండ్ పెరిగిన విషయాన్ని సీఎం కేసీఆర్ దగ్గర మీడియా కూడా ప్రస్తావించడం విశేషం. అయితే, ప్రజల ఆదాయాలు తగ్గడం, ఇతర కారణాలు తోడయి రెండేళ్లుగా కొవిడ్ తీవ్రత చికెన్ అమ్మకాలపైనా ప్రభావం చూపింది. ఇప్పుడు కరోనా భయం తగ్గడంతో పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి.
ఎండలతోనే ధరల సెగ
వేడికి కోళ్ల మరణాలు, ఉత్పత్తి తగ్గింపు తదితర కారణాలతో సహజంగానే ఎండా కాలంలో కోడి మాంసం ధర ఎక్కువగా ఉంటుంది. కానీ, అది వేసవి మధ్యకు వచ్చేసరికి. ఈసారి మాత్రం వేసవి ప్రారంభంలోనే ప్రభావం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పులకు సర్దుబాటు కాలేక కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలూ పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 7,200 రూపాయలు ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది. కాగా, కొన్నాళ్లకు నాటు కోడి ధర కూడా పెరుగుతంని భావిస్తున్నారు.
ప్రస్తుతం రూ.400 ఉన్న ధర రూ.500కు చేరుతుందని అంటున్నారు. ఇక మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఫారాల్లో పెంచి కిలో మాంసం రూ.500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.
మటన్ కూ దీటుగా
ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ ధర రూ.750 నుంచి రూ.800 ఉంది. నాణ్యతను బట్టి రూ.820 కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు బ్రాయిలర్ కోడి ధరను చూస్తే మటన్ ధరకు దాదాపు సగం ఉన్నట్లు. అయితే, స్థోమత, అందుబాటు, వీలును బట్టి మటన్ ను కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. కొందరు కొంత చికెన్, కొంత మటన్ తీసుకుని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంటారు. మరోవైపు అందరూ మటన్ తినేందుకు ఆసక్తిచూపరు. దీంతోనే మటన్ విక్రయాలు చికెన్ తో పోలిస్తే సగంలోపే ఉంటాయి.