కరోనా భయానికి గుండె ఆగిపోతోంది. ఆ పేరు చెబితినే ఇప్పుడు జనాలు వణికి పోతున్నారు. తమ వారికి కరోనా సోకిందని తెలియగానే ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు హఠాన్మరణాలు పొందుతున్నారు. కరోనా భయానికి బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ పెరుగుతోందని సర్వేలో తేలింది. కరోనాతో మానసిక ఆందోళన తీవ్రం కావడంతో వారి గుండె ఆగిపోతోంది.
కరోనాతో అందరి ఉపాధి పోయింది. ఆర్థిక సమస్యలు.. చేతిలో రూపాయి లేదు. భవిష్యత్ పై బెంగ.. ఇలాంటి తీవ్ర మానసిక ఆందోళనల నడుమ ఒత్తిడితో కరోనా కుటుంబంలో ఒక్కరికి సోకినా మిగతా ఇంటిపెద్దల గుండె ఆగిపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు.. గుండె జబ్బులకు గురై చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.
కరోనా భయానికి ఒత్తిడి స్థాయి తీవ్రమై తాత్కాలికంగా గుండె కండరాలు బలహీనమై గుండెపోటుకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీన్నే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ గా అభివర్ణిస్తున్నారు. ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో వీరే 10-15శాతం మంది ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలా కరోనా వైరస్ భయమే చాలా మందిని సగం చంపేస్తోందని తేలింది.