బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్ బావకి తప్పిన పెను ప్రమాదం !

Update: 2020-02-15 06:40 GMT
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆయన కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. సరైన సమయం లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం తో బ్రదర్ అనిల్ ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయట పడ్డారు.

అయితే , ఈ ప్రమాదం లో కారు ముందు భాగం బాగా దెబ్బతినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాద సంఘటన గురించి తెలియగానే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లి , ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించి , అక్కడి పరిస్థితి ని సమీక్షించారు. ఆ తరువాత బ్రదర్ అనిల్, ఆయన గన్‌ మెన్లను మరో కారు లో ఎక్కించి అక్కడినుంచి పంపించారు. ఈ ఘటన కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News