ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక మార్పులు జరగనున్నాయి!.ఇందుకు ఇవాళ్టి పరిణామాలే సాక్షిగా నిలవబోతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఇవాళ బీసీ,ఎస్టీ నేతలతో బ్రదర్ అనీల్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీరంతా తమ అసంతృప్తిని ఆయన ఎదుట ఉంచారు.
ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గెలుపే ధ్యేయంగా ఆ రోజు తాము పనిచేశామని,కానీ ఇవాళ కనీసం ఆయనను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతూ మీడియా ఎదుట కొందరు కీలక నాయకులు స్పందించారు. తమ సమస్యలన్నింటినీ బ్రదర్ అనీల్ కు వివరించామని,ఆయనే దీనికి సంబంధించి స్పష్టమయిన ప్రకటన చేయనున్నారని అన్నారు.
అంతేకాకుండా విపక్షంలో ఉన్నప్పుడు దళిత,మైనార్టీలతో పాటు బీసీల సమస్యలపై తాము కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేవారమని,ఆ విధంగా తమ గోడు వినిపించేవారమని, కానీ ఇప్పుడు కనీసం మాట్లాడేందుకే అవకాశం లేకుండా, ధర్నాలు అంటే ముందస్తు అరెస్టులతో, గృహ నిర్బంధాలతో హడలెత్తిస్తున్నారని ఆవేదన చెందారు కొందరు బీసీ నాయకులు. అనీల్ తో భేటీ అనంతరం చాలా క్లారిటీతో వీళ్లంతా మీడియా ఎదుట మాట్లాడి జగన్ పై పోరు కు తాము సిద్ధమేనన్న సంకేతాలు అయితే ఇచ్చారు.
మరోవైపు బ్రదర్ అనీల్ పార్టీ స్థాపిస్తే వెళ్లేదెవరు అన్న చర్చ ఒకటి నడుస్తోంది.ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే ఉన్న షర్మిల ఇటు వస్తారా లేదా అల్లుడు అనీల్ మాత్రమే ఈ పార్టీని ఇక్కడ నిర్మించి దీనిని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్తారా అన్నది సంశయాత్మకంగా ఉంది.
ముఖ్యంగా ఆ రోజు జగన్ అధికారంలోకి వచ్చేందుకు క్రిస్టియన్,మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎన్నో సమావేశాలు జరిగాయి.ఆయా సమావేశాల్లో బ్రదర్ అనీల్ ఎంతో కీలకం అయ్యారు. క్రిస్టియన్ వర్గాల వరకూ ఆయనే స్టార్ క్యాంపైనర్ గా నిలిచారు. మైనార్టీ వర్గాల వరకూ ఇంకొందరు కీలక నేతలు జగన్ వెంట నడిచారు.
ఇంకా చెప్పాలంటే ఎంఐఎంతో ఎప్పటి నుంచో దోస్తీ ఉన్న కారణంగా ఓ విధంగా జగన్ వెంట ఆ రెండు మతాలకూ చెందిన నేతలు నడిచి ఆయన గెలుపునకు ఎంతో సాయం చేశారు.కానీ ఇప్పుడు అవే వర్గాలు జగన్ కు ఝలక్ ఇవ్వనున్నాయి.ఈ మార్పు నెల్లూరుతో మొదలయి విశాఖ వరకూ ప్రభావం చూపనుంది అని తెలుస్తోంది.
Full View