హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను మరిచిపోకముందే ఒడిషా రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఒడిశాలోని కటక్ లో 17 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ తన మిత్రుడితో కలిసి 22 రోజుల పాటు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లోంచి అలిగి వచ్చిన బాలిక మాయగాళ్ల చేతిలో చిక్కి నలిగిపోయింది.
ఒడిషాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ కు చెందిన బాలిక తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కటక్ చేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లిపోవాలని మనసు మార్చుకుంది. కటక్ లోని ఓఎంసీ స్క్వేర్ వద్ద బస్టాప్ లో ఉండగా.. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన బాలిక అతడి బైక్ ఎక్కింది. అక్కడి నుంచి బాలికను త్రితాల్ కు తీసుకెళ్లకుండా గాటిరూట్ పట్నా గ్రామ శివార్లలోని పౌల్ట్రీ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఓ గదిలో బంధించాడు. బాలికను 22 రోజులపాటు బంధించి మరో వ్యక్తితో కలిసి అత్యాచారం చేశాడు.
గమనించిన కొందరు స్థానిక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెక్ చేయగా బాలిక కనిపించింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలికను శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు.
నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ కేసులను నమోదు చేశారు. ఈ ఘటనపై అధికార నవీన్ పట్నాయక్ సర్కార్ ను ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శించాయి. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదని మండిపడ్డాయి.