రాజధాని నగరమైన హైదరాబాద్ లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. చైతన్యపురిలో పండ్ల మార్కెట్‌లో శుక్రవారం రాత్రి వ్యక్తిని దుండగులు గొంతు కోసి చంపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మార్కెట్‌లో పండ్ల దొంగల మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. రాజు అనే పాత నేరస్థుడుని గొంతుకోసి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మల్లాపూర్ కు చెందిన రాజు గత నెలలో పండ్ల దొంగతనం కేసులో అరెస్ట్ అయి ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ కిరాతం అంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఫ్రూట్ మార్కెట్ లలో తరచు పండ్లను దొంగిలించేవాడని, అదే క్రమంలో బాగా మద్యం సేవించి, నిన్న రాత్రి కూడా ఫ్రూట్ మార్కెట్ లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్ తో గొడవపడి, నన్నే అరెస్టు చేపిస్తావా, నీ అంతు చూస్తానని రాజు బెదిరించినట్లు తెలుస్తోంది. రాజు బెదిరింపులకు దిగడంతో నిన్న రాత్రి చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిరోజ్. మార్కెట్‌లో ఉన్న సీసీ కెమెరా లో మాత్రం మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.